ఏమివలసిన నిచ్చు నెప్పుడైననే

ఏమివలసిన నిచ్చు నెప్పుడైననే

॥పల్లవి॥
ఏమివలసిన నిచ్చు నెప్పుడైననే
యేమరిక కొలిచిన నీతఁడే దైవము
link
॥చ1॥
ఘనముగా నిందరికిఁ గన్నులిచ్చుఁ గాళ్లిచ్చు
పనిసేయఁ జేతులిచ్చు బలియుఁడై
తనుఁగొలువుమని చిత్తములిచ్చుఁ గరుణించి
వొనర లోకానకెల్ల నొక్కఁడే దైవము
॥చ2॥
మచ్చిక తనుఁగొలువ మనసిచ్చు మాటలిచ్చు
కుచ్చితములేని కొడుకుల నిచ్చును
చొచ్చినచోటే చొచ్చి శుభమిచ్చు సుఖమిచ్చు
నిచ్చలు లోకానకెల్ల నిజమైనదైవము
॥చ3॥
పంతమాడి కొలిచినఁ బ్రాణమిచ్చు ప్రాయమిచ్చు
యెంతటి పదవులైన నిట్టె యిచ్చు
వింతవింత విభవాల వేంకటేశుఁడిదె మా-
యంతరంగముననుండే అరచేతిదైవము
రాగము: బౌళి
రేకు: 0028-04
సంపుటము: 1-172

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, బౌళి

చదవండి :  ఎంతసేసినా నెడయకే పోయ

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *