ఏమిఫలము దా నిన్నియునుఁ దెలిసినను – అన్నమయ్య సంకీర్తన

ఏమిఫలము దా నిన్నియునుఁ దెలిసినను – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
ఏమిఫలము దా నిన్నియునుఁ దెలిసినను
సామునేసిన ఫలము జయశీలుఁడౌట గాక
॥చ1॥
తానుగలిగిన ఫలము దయ సేయఁగలుగుట
మేనుగలిగిన ఫలము మేలెల్ల గనుట
మానుషముగల ఫలము మంచివాఁడౌట తనుఁ
దానె తెలిసినఫలము తత్వపరుఁడౌట గాక
॥చ2॥
పదిలమగు కులము గల ఫలము తాఁజదువుట
చదివినఫలం బర్థసారంబు గనుట
పొదలి శాస్త్రర్థంబు పొడగన్న ఫలము మతి
దలఁకకిటు వేంకటేశుదాఁడౌట గాక
రాగము: దేవగాంధారి
రేకు: 0038-06
సంపుటము: 1-236

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, దేవగాంధారి

చదవండి :  మోసమున మాయావిమోహితుఁడై పోయి

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *