ఏపనులు సేసినా నిటువలెనేపో – అన్నమయ్య సంకీర్తన

ఏపనులు సేసినా నిటువలెనేపో – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
ఏపనులు సేసినా నిటువలెనేపో
యీపనికిఁ జొరనిపని యేటిలోపైరు
॥చ1॥
హరికథలమీఁదిప్రియమబ్బు నా తొంటితమ….
పరిపక్వమగుఁ దప: ఫలముగాక
గరిమె నివిలేకున్నఁ గలకాలములుఁ జేయు
నిరతంపుఁదపమెల్ల నీటిలో వ్రాత్ర
॥చ2॥
నారాయణునిభక్తి ననిచెనా ధనమెల్లఁ
బారఁజల్లిన దానఫల మదియపో
కోరి యివి లేకున్న కోటిదానములైన
పేరుకొని వరతఁగలపినచింతపండు
॥చ3॥
వదల కిటు వేంకటేశ్వరుఁడే దైవంబనుచుఁ
జదువఁగలిగిన మంచిచదు వదియపో
పదిలముగ నీవిధము పట్టియ్యకుండినను
చదువు లసురలు మున్ను చదివేటిచదువు
రాగము: ఆహిరి
రేకు: 0070-01
సంపుటము: 1-364

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ఆహిరి

చదవండి :  ఎక్కువ కులజుఁడైన హీన కులజుఁడైన - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: