
ఏదియునులేని దేఁటిజన్మము – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఏదియునులేని దేఁటిజన్మము వేదాంతవిద్యావివేకి గావలెను ॥చ1॥ పరమమూ ర్తిధ్యానపరుఁడు గావలె నొండె పరమానందసంపద లొందవలెను పరమార్థముగ నాత్మభావింపవలె నొండె పరమే తానై పరగుండవలెను ॥చ2॥ వేదశాస్త్రార్థకోవిదుఁడు గావలె నొండె వేదాంతవిదుల సేవించవలెను కాదనక పుణ్యసత్కర్మి గావలె నొండె మోదమున హరిభక్తి మొగి నుండవలెను ॥చ3॥ సతతభూదదయావిచారి గావలె నొండె జితమైనయింద్రియస్థిరుఁడు గావలెను అతిశయంబగు వేంకటాద్రీశుసేవకులె గతియనుచు తనబుద్ధిఁ గలిగుండవలెను |
రాగము: నాట రేకు: 0049-04 సంపుటము: 1-301 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, నాట