ఎవ్వరికైనను యీవ్రాఁత నను – అన్నమయ్య సంకీర్తన

ఎవ్వరికైనను యీవ్రాఁత నను – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
ఎవ్వరికైనను యీవ్రాఁత నను
నవ్వులు సేసెఁబో నావ్రాఁత
॥చ1॥
తొలిజన్మంబున దోషకారియై
నలుగడఁ దిప్పెను నావ్రాఁత
యిల దుర్గణముల కీజన్మంబున –
నలఁకువ నేనెఁబో నావ్రాఁత
॥చ2॥
పురుషునిఁజే శల్పుని ననిపించుట
నరజన్మమునకు నావ్రాఁత
తరుచయ్యినపాతక మరుపెట్టుక
నరకము చూపెఁబో నావ్రాఁత
॥చ3॥
పామఱితనమున బహువేదనలను
నామన సెనసెఁబో నావ్రాఁత
కామితఫలు వేంకటపతినిఁ గొలిచి
నామతి దెలిపెఁబో నావ్రాఁత
రాగము: ముఖారి
రేకు: 0038-03
సంపుటము: 1-233

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారి

చదవండి :  పారకుమీ వోమనసా పంతము విడువకు మీమనసా

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *