
ఎవ్వరిఁ గాదన్న నిది నిన్నుఁ గాదంట
॥పల్లవి॥ ఎవ్వరిఁ గాదన్న నిది నిన్నుఁ గాదంట యెవ్వరిఁ గొలిచిన నిది నీకొలువు ॥చ1॥ అవయవములలో నదిగా దిదిగా- దవి మే లివి మే లన నేలా భువియుఁ బాతాళము దివియు నందలిజంతు- నివహ మింతయునూ నీదేహమేకాన ॥చ2॥ నీవు లేనిచోటు నిజముగఁ దెలిసిన ఆవల నది గా దనవచ్చును శ్రీవేంకటగిరి శ్రీనాథ సకలము భావింప నీవే పరిపూర్ణుఁడవుగాన |
రాగము: బౌళి రేకు: 0002-03 సంపుటము: 1-9 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, బౌళి