ఎన్ని భాధలఁబెట్టి – అన్నమయ్య సంకీర్తన

ఎన్ని భాధలఁబెట్టి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
ఎన్ని భాధలఁబెట్టి యేఁచెదవు నీవింక నెంతకాలముదాఁకఁ గర్మమా
మన్నించుమనుచు నీ మఱఁగు జొచ్చితిమి మామాటాలకించవో కర్మమా
॥చ1॥
ప్రతిలేని దురితములపాలు సేయక నన్నుఁబాలించవైతి వో కర్మమా
తతితోడ నాత్మపరితాపంబుతోడుతను తగులేల సేసి తోకర్మమా
జితకాలములకుఁగాని చేతికిని లోనయి చిక్క వేకాలంబు కర్మమా
మతిహీనులైనట్టిమాకు నొకపరిపాటిమార్గంబు చూపవో కర్మమా
॥చ2॥
ఆసలనియెడితాళ్ళ నంటగట్టుక విధికి నప్పగించితివిగదె కర్మమా
వాసి విడిచితిమి నీవారమైతిమి మమ్ము వన్నె చెడనీకు వో కర్మమా
కాసుకనుఁ గొరగాని గతిలేని పనికిఁగా కాలుఁదనీవేల కర్మమా
వోసరించొకమారు వొయ్యనే వొకరీతి నొల్లనని తలఁగుమీకర్మమా
॥చ3॥
తిరువేంకటాచలాధిపునిమాయలచేతదెసలఁదిరిగినయట్టికర్మమా
హరిదాసులగువారి నాదరింతువుగాక అంత నొప్పింతువా కర్మమా
వరుస నేనుగమీఁదవాని సున్నంబడుగవచ్చునా నీకిట్లఁ గర్మమా
పరమపురుషోత్తముని భ్రమతఁబడి నీవిట్ల బట్టబయలైతిగా కర్మమా
రాగము: శ్రీరాగం
రేకు: 0046-05
సంపుటము: 1-284

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం

చదవండి :  ఈ విశ్వాసంబు యెవ్వరికిఁ దోఁప దిది

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *