
ఎదుటినిధానమ వెటుచూచిన నీ- – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఎదుటినిధానమ వెటుచూచిన నీ- వదె వేంకటగిరియనంతుఁడా ॥చ1॥ సొగిసి భాద్రపదశుద్ధచతుర్ధశి తగువేడుక నిందరు గొలువ పగటుసంపదలు బహుళ మొసఁగు నీ- వగు వేంకటగిరియనంతుఁడా ॥చ2॥ తొలుత సుశీలకు దుశ్శీలవలన వెలయ సంపదల విముఖఁడవై వలెనని కొలిచిన వడిఁ గాచినమా- యల వేంకటగిరియనంతుఁడా ॥చ3॥ కరుణఁ గాచితివి కౌండిన్యుని మును పరగినవృద్ధబ్రహ్మఁడవై దొరవులు మావులు ధ్రువముగఁ గాచిన- హరి వేంకటగిరియనంతుఁడా |
రాగము: శుద్దవసంతం రేకు: 0066-05 సంపుటము: 1-344 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శుద్దవసంతం