
ఎడమపురివెట్టె పరహితవివేకము, లోన – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఎడమపురివెట్టె పరహితవివేకము, లోన గుడుసువడెఁ జదువు, మెరుఁగులువారెఁ జలము read ॥చ1॥ లంప మేయఁగఁదొణఁగె లలితంపుమతి లోనె, తెంపు దిగవిడిచె యెడ తెగనిమానంబు, చంప దొరకొనియె వేటలేని తమకంబు, యింపు ఘనమాయ నే నిఁకనేమి సేతు ॥చ2॥ బయలువందిలివెట్టు పనిలేనిలంపటము, దయ విడువఁదొడఁగె చిత్తములోనికాంక్ష, పయికొన్న మోహంబు పడనిపాట్లఁ బరచె, లయమాయ శాంతి మెల్లనె తీరె నెరుక ॥చ3॥ చావుఁబుట్టువు మఱచె సంసారబంధబు, దైవమును విడిచె యాతరికంపుఁబ్రియము శ్రీవేంకటేశ్వరుఁడు చిత్తరంజకుఁడు యిఁకఁ గావలసినది యతనికరుణ ప్రాణులకు |
రాగము: ఆహిరి రేకు: 0061-06 సంపుటము: 1-315 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ఆహిరి