
ఎటువంటిరౌద్రమో యెటువంటికోపమో – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఎటువంటిరౌద్రమో యెటువంటికోపమో తటతట నిరువంక దాఁటీ వీఁడే ॥చ1॥ తోరంపుఁ బెనుచేతుల మల్లచఱచి దారుణలీలఁ బెదవు లవుడుకఱచి కారించి చాణూరుఁ గడుభంగపఱచి వీరుఁడై యెముకలు విఱచీ వీఁడే ॥చ2॥ పిడుగడచినయట్టు పెడచేత నడిచి – పడనీక పురములోపలఁ జొరఁబొడిచి తొడిచి చాణూరు నెత్తుక దయవిడిచి వడివెట్టి నెత్తురు వడిచీ వీఁడే ॥చ3॥ బుసకొట్టుచును వూరుపులఁ జెమరించి మసిగాఁగ బెదపెదమల్లుల దంచీ- నెసఁగి శ్రీతిరువేంకటేశుఁడై మించి ముసిముసినవ్వుల ముంచీ వీఁడే |
రాగము: ఆహిరి రేకు: 0034-04 సంపుటము: 1-211 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ఆహిరి