
ఎచ్చోటి కేఁగిన యెప్పుడూఁ దమలోని – – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఎచ్చోటి కేఁగిన యెప్పుడూఁ దమలోని – మచ్చిక పెనుఁదెవులు మానకపోయె ॥చ1॥ పాయపు సతులగుబ్బల పెదపొట్లాల కాయము వడి నొత్తి కాఁచఁగను రాయిడిచే ఘనమాయఁగాని లోని- మాయపు పెనుఁదెవులు మానకపోయె ॥చ2॥ అతివల మోహపుటధరామృతములు యితవుగ నోరి కందియ్యఁగను అదిమోహమే ఘనమాయఁగాని లోని- మతకరిపెనుఁదెవులు మానకపొయె ॥చ3॥ తరుణుల మేనిమెత్తనిపరపులమీఁద- నిరవుగ నిటు సుఖియించఁగను తిరువేంకటాచలాధీశుకృపచేఁగాని మరుచేతి పెనుఁదెవులు మానకపోయె |
రాగము: వరాళి రేకు: 0045-01 సంపుటము: 1-273 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, వరాళి