
ఎక్కువ కులజుఁడైన హీన కులజుఁడైన – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఎక్కువ కులజుఁడైన హీన కులజుఁడైన నిక్కమెరిఁగిన మహా నిత్యుఁడే ఘనుఁడు ॥చ1॥ వేదములు చదివియును విముఖుఁడై హరిభక్తి యాచరించని సోమయాజికంటె యేదియునులేని కులహీనుఁడైనను విష్ణు_ పాదములు సేవించు భక్తుఁడే ఘనుడు ॥చ2॥ పరమగువేదాంతపఠన దొరికియు సదా హరిభక్తిలేని సన్యాసికంటె సరవి మాలిన యంత్యజాతికులజుఁడైన_ నరసి విష్ణునివెదకు నాతఁడే ఘనుఁడు ॥చ3॥ వినియుఁ జదివియును శ్రీ విభునిదాసుఁడుగాక తనువు వేఁపుచునుండుతపసికంటె యెనలేని శ్రీవేంకటేశుప్రసాదాన్న_ మనుభవించినయాతఁ డప్పుడే ఘనుడు |
రాగము: సామంతం రేకు: 0062-03 సంపుటము: 1-318 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం