ఎంతైన దొలఁగవై తేదైన నామతికి

॥పల్లవి॥
ఎంతైన దొలఁగవై తేదైన నామతికి
వింతచవిసేతుగా విషయబుద్ధి
॥చ1॥
ఎనసి జన్మముల నే నెట్ల నుండిన బోక
వెనకఁ దిరుగుదువు గా విషయబుద్ధి
అనువైనయనుభవన లనుభవించఁగఁ జేసి
వెనక మఱపింతుగా విషయబుద్ధి
॥చ2॥
కెఱలి కాంతలు నేనుఁ గినిసిననుఁ బొలయలుక
విఱిచి కలపుదువుగా విషయబుద్ధి
తఱితోడ వావివ ర్తనదలంచిననన్ను
వెఱపు దెలుపుదువుగా విషయబుద్ధి
॥చ3॥
యెడలేనియాపదల నెట్లువొరలిన నన్ను
విడిచిపోవైతిగా విషయబుద్ధి
సడిఁబెట్టి వేంకటస్వామికృపచే నిన్ను
విడిపించవలసెఁగా విషయబుద్ధి
రాగము: దేసాక్షి
రేకు: 0012-05
సంపుటము: 1-76

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, దేసాక్షి

చదవండి :  దురితదేహులే తొల్లియును శ్రీ-

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *