ఎంతపాపకర్మమాయ యెంతవింతచింతలాయ

ఎంతపాపకర్మమాయ యెంతవింతచింతలాయ

॥పల్లవి॥
ఎంతపాపకర్మమాయ యెంతవింతచింతలాయ
వింతవారితోడిపొందు వేసటాయ దైవమా
॥చ1॥
చూడఁజూడఁ గొత్తలాయ చుట్టమొకఁడు లేఁడాయ
వీడుఁబట్టు ఆలుచాయ వేడుక లుడివోయను
జోడుజోడు గూడదాయ చొక్కుఁదనము మానదాయ
యేడకేడ తలపోఁత యెంతసేసె దైవమా
॥చ2॥
నీరులేనియేఱు దాఁటనేర దెంతేలోఁతాయ
మేరవెళ్ల నీఁదఁడాయ మేఁటిఁ జేరఁడాయను
తోరమైన ఆస లుబ్బి తోవ గానిపించదాయ
కోరి రాకపోకచేత కొల్లఁబోయఁ గాలము
॥చ3॥
తల్లి దండ్రి దాత గురువు తానెయైననాచారి
వల్లభుండు నాకు మేలువంటిదాయ జన్మము
కల్లగాదు వేంకటేశుఘనుని పాదసేవ నాకు
మొల్ల మాయ నామనసు మోదమాయ దైవమా
రాగము: భైరవి
రేకు: 0030-05
సంపుటము: 1-186

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, భైరవి

చదవండి :  కొనుట వెగ్గళము దాఁ దినుట యల్పము మీఁదు-

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *