
ఎంతగాలమొకదా యీ దేహధారణము – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఎంతగాలమొకదా యీ దేహధారణము చింతాపరంపరలఁ జిక్కువడవలనె ॥చ1॥ పడిగొన్న మోహంబువలలఁ దగులైకదా కడలేని గర్భనరకము లీఁదవలనె నడిమిసుఖములచేత ననుపుసేయఁగఁగదా తొడరి హేయపుదిడ్డిఁ దూరాడవలనె ॥చ2॥ పాపపుంజములచేఁ బట్టువడఁగాఁగదా ఆపదల తోడిదేహము మోవవలనె చూపులకులోనైన సుఖము గానక కదా దీపనభ్రాంతిచేఁ దిరిగాడవలనె ॥చ3॥ హితుఁడైన తిరువేంకటేశుఁ గొలువకకదా పత్రిలేని నరకకూపమునఁ బడవలనె అతనికరుణారసంబబ్బ కుండఁగఁగదా బతిమాలి నలుగడలఁ బారాడవలనె |
రాగము: శ్రీరాగం రేకు: 0062-01 సంపుటము: 1-316 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం