
ఊరికిఁ బోయెడి వోతఁడ కడు- – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఊరికిఁ బోయెడి వోతఁడ కడు- చేరువతెరు వేఁగి చెలఁగుమీ ॥చ1॥ ఎడమతెరువువంక కేఁగిన దొంగలు తొడిఁబడ గోకలు దోఁచేరు కుడితెరువున కేఁగి కొట్టువడక మంచి- నడిమితెరువుననే నడవుమీ ॥చ2॥ అడ్డపుఁ దెరువుల నటునిటుఁ జుట్టాలు వెడ్డువెట్టుచు నిన్ను వేఁచేరు గొడ్డేరేచిన్నదిడ్డితెరువు వోక దొడ్డతెరువువంక తొలఁగుమీ ॥చ3॥ కొండతెరువు కేఁగి కొంచపుసుఖముల బండై తిరుగుచు బడలేవు అండనుండెడిపరమాత్ముని తిరుమల- కొండతెరువు తేఁకువ నేఁగుమీ |
రాగము: ఆహిరి రేకు: 0015-01 సంపుటము: 1-89 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ఆహిరి