శనివారం , 21 డిసెంబర్ 2024

ఉయ్యాలతాడే ఉరితాడయింది…

కడప: ఉయ్యాల తాడు ఓ చిన్నారి పాలిట ఉరితాడయింది. ఉయ్యాల ఊగుతుండగా ప్రమాదవశాత్తూ ఆ తాడు మెడకు బిగుసుకుని ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంఘటన కడప నగరంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

మరియపురానికి చెందిన నయోమి(10) అనే బాలిక గురువారం మధ్యాహ్నం స్కూలు నుంచి ఇంటికి వచ్చి ఊయల ఊగుతుండగా ప్రమాదవశాత్తు ఊయల తాడు ఆ బాలిక గొంతుకు బిగుసుకుంది. దాని నుంచి బైట పడేందుకు చిన్నారి చేసిన ప్రయత్నం ఫలించక ఊపిరాడక మృతి చెందింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవటంతో బాలికను ఎవరూ రక్షించలేకపోయారు.

చదవండి :  'సీమ కోసం సభలో నోరెత్తండి'

ఇటువంటి ఘటనలు ఆయా కుటుంబాలలో విషాదాన్ని మిగులుస్తాయి. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయాలలో ఇటువంటి ఉయ్యాలలు అవీ పిల్లలకు అందుబాటులో లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: