
ఉప్పవడము గాకున్న రిందరు
॥పల్లవి॥ ఉప్పవడము గాకున్న రిందరు యెప్పుడు రేయి నీకెప్పుడు పగలు ॥చ1॥ కన్నుల చంద్రుఁడును కమలమిత్రుఁడును వున్నతి నివి నీకుండఁగను వెన్నెలయెండలు వెలయఁగ మేల్కొను- టెన్నఁడు నిద్దర యెన్నఁడు నీకు ॥చ2॥ కందువ సతికనుఁగలువలు ముఖార- విందము నిదివో వికసించె ముందర నిద్దుర మొలవదు చూచిన విందగునీతెలివికిఁ దుద యేది ॥చ3॥ తమము రాజసము తగుసాత్వికమును- నమరిన నీమాయారతులు కమలాధిప వేంకటగిరీశ నిన్ను ప్రమదము మఱపునుఁ బైకొనుటెట్లా |
రాగము: ధన్నాశి రేకు: 0024-06 సంపుటము: 1-148 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ధన్నాశి