
ఇన్ని జన్మము లేఁటికి హరిదాసు- – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఇన్ని జన్మము లేఁటికి హరిదాసు- లున్న వూరఁ దా నుండినఁ జాలు ॥చ1॥ హరిభక్తుల యింటియన్నము గొనువారి- వరువుడై వుండవలెనన్నఁ జాలు పరిమభాగవత భవనంబులఁ జెడ్డ పురువు దానయి పొడమినఁ జాలు ॥చ2॥ వాసుదేవుని భక్తవరులదాసులు మున్ను- రోసినయెంగిలి రుచిగొన్నఁ జాలు శ్రీ సతీశునిఁ దలఁచినవారి దాసాన- దాఁసుడై వుండఁదలఁచినఁ జాలు ॥చ3॥ శ్రీ వేంకటేశుఁ జూచినవారిశ్రీ పాద- సేవకుఁడై యండఁజేరినఁ జాలు యీవిభుదాసుల హితుల పాదధూళి- పావనమై సోఁకి బ్రదికినఁ జాలు |
రాగము: శ్రీరాగం రేకు: 0070-04 సంపుటము: 1-367 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం