
ఇత్తడి బంగారుసేయ నింతకు నేరుతునంటా – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఇత్తడి బంగారుసేయ నింతకు నేరుతునంటా కొత్తసేఁతలెల్ల దొరకొంటిగా నీవు ॥చ1॥ హీనులైనవారు నిన్ను నేచి కొలిచిన ఘన- మైన పదవులఁ బెట్టేయెటువలెనే మానక యెవ్వతెనైన మచ్చికఁ దగిలి నాతో ….. నానిపట్టి సరివేసే వద్దిరా నీవూ ॥చ2॥ కడుఁబాతకులు నిన్నుఁ గదిసి కొలిచేరంటా- నడరి పుణ్యులఁజేయునటువలెనే కడఁగి యెవ్వతెనైన గాజు మాణికము సేసి వడి నన్నుఁ గెరలించవద్దురా నీవూ ॥చ3॥ దిందుపడ మాయసేసి దేవుఁడ నేఁగానంటా…. నందరి భ్రమలఁ బెట్టునటువలెనే అందమైనన తిరువేంకటాద్రీశ నీప్రేమ చెంది నన్నుఁ గూడి దాఁచజెల్లునా నీవూ |
రాగము: సామంత రేకు: 0069-03 సంపుటము: 1-360 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంత