ఇందుకొరకె యిందరును నిట్లయిరి

॥పల్లవి॥
ఇందుకొరకె యిందరును నిట్లయిరి
కిందుపడి మఱికాని గెలుపెఱఁగరాదు
factus.dk
read
॥చ1॥
అటమటపువేడుకల నలయించి మఱికదా
ఘటియించుఁ బరము తటుకన దైవము
ఇటు సేయ నీశ్వరున కీసు గలదా? లేదు.
కుటిలమతిఁ గని కాని గుణిఁ గానరాదు
॥చ2॥
బెండుపడ నవగతులఁ బెనఁగించి మఱికదా
కొండనుచుఁ బర మొసంగును దైవము
బండుసేయఁగ హరికి బంతమా? యటుగాదు.
యెండదాఁకక నీడహిత వెఱఁగరాదు
॥చ3॥
మునుప వేల్పులకెల్ల మ్రొక్కించి మఱికదా
తనభ క్తి యొసఁగు నంతట దైవము
ఘనవేంకటేశునకు గపటమా? అటుగాదు.
తినక చేఁదునుఁ దీపు తెలియనేరాదు.
రాగము: మాళవిశ్రీ
రేకు: 0002-05
సంపుటము: 1-11

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, మాళవిశ్రీ

చదవండి :  నిగమనిగమాంత వర్ణిత మనోహర రూప - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: