
ఇందిరా నాయక యిదివో మాపాటు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఇందిరా నాయక యిదివో మాపాటు చెంది నీవే గతి చేకొనవయ్యా is-aber.net ॥చ1॥ తీసీఁ గోరికతీదీపు లొకవంక లాసీ సంసారలంపటము మూసీఁ గర్మము మునుకొని పరచింత సేసేదేమిఁకఁ జెప్పే దేమి ॥చ2॥ వంచీ నాసలు వలసినచోటికి పొంచీ దుర్గుణబోగములు ముంచీ యౌవనమోహాంధకారము యెంచేదేమి సోదించేదేమి ॥చ3॥ యెఱిఁగీఁ జిత్తము యించుకించుక నిన్ను మఱవనినీపైభక్తి మతినుండఁగా నెఱి శ్రీవేంకటపతి నీవే కాతువుగాక వెఱచి నేఁజేసే విన్నపమేమి |
రాగము: రామక్రియ రేకు: 0079-04 సంపుటము: 1-379 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, రామక్రియ