ఇందిర వడ్డించ నింపుగను
॥పల్లవి॥ ఇందిర వడ్డించ నింపుగను చిందక యిట్లే భుజించవో స్వామి- ॥చ1॥ అక్కాళపాశాలు నప్పాలు వడలు పెక్కైనసయిఁదంపుపేణులును సక్కెరరాసులు సధ్యోఘృతములు కిక్కిరియ నారగించవో స్యామీ ॥చ2॥ మీరినకెళంగు మిరియపుఁదాళింపుఁ – గూరలు కమ్మనికూరలును సారంపుఁబచ్చళ్ళు చవులుగ నిట్టే కూరిమితోఁ జేకొనవో స్వామీ ॥చ3॥ పిండివంటలునుఁ బెరుగులుఁ బాలు మెండైన పాశాలు మెచ్చి మెచ్చి కొండలుపొడవు కోరి దివ్యాన్నాలు వెండియు మెచ్చేవే వేంకటస్వామీ |
రాగము: శ్రీరాగం రేకు: 0004-02 సంపుటము: 1-22 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శ్రీరాగం