ఇందరికి నభయంబు లిచ్చుఁ జేయి – అన్నమయ్య సంకీర్తన

ఇందరికి నభయంబు లిచ్చుఁ జేయి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
ఇందరికి నభయంబు లిచ్చుఁ జేయి
కందువగు మంచి బంగారు చేయి
॥చ1॥
వెలలేనివేదములు వెదకితెచ్చిన చేయి
చిలుకుగుబ్బలికిందఁ జేర్చు చేయి
కలికియగు భూకాంతఁ గాఁగిలించిన చేయి
వలనైన కొనగోళ్ళవాఁడి చేయి
॥చ2॥
తనివోక బలిచేత దానమడిగిన చేయి
వొనరంగ భూదానమొసఁగు చేయి
మొనసి జలనిధి యమ్ము మొనకుఁ దెచ్చిన చేయి
యెనయ నాఁగేలు ధరింయిచు చేయి
॥చ3॥
పురసతుల మానములు పొల్లసేసిన చేయి
తురగంబుఁ బరపెడిదొడ్డ చేయి
తిరువేంకటాచలధీశుఁడై మోక్షంబు
తెరువు ప్రాణులకెల్లఁదెలిపెడి చేయి
రాగము: సామంతం
రేకు: 0065-01
సంపుటము: 1-334

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం

చదవండి :  కానీవయ్య అందుకేమి కడపరాయ

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: