ఆలాగుపొందులును నటువంటికూటములు – అన్నమయ్య సంకీర్తన

ఆలాగుపొందులును నటువంటికూటములు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
ఆలాగుపొందులును నటువంటికూటములు
యీలాగులౌట నేఁడిదె చూడనయితి
॥చ1॥
అడియాసచూపులకు నాసగించితిఁగాని
వెడమాయలని లోను వెదకలేనైతి
కడువేడుకలఁ దగిలి గాసిఁ బొందితిఁగాని
యెడలేనిపరితాప మెఱఁగలేనైతి
॥చ2॥
చిరునగవుమాటలకుఁ జిత్తగించితిఁగాని
తరితీపులని లోనుఁ దలఁపలేనైతి
వరుస మోహపుఁ బసలవలలఁ జిక్కితిఁగాని
గరువంపుఁ బొలయలుక గానలేనైతి
॥చ3॥
శ్రీవేంకటేశ్వరునిఁ జింత సేసితిఁగాని
దేవోత్తమునిలాగుఁ దెలియలేనైతి
యీవైభవముపై నిచ్చగించితిఁగాని
యీవైభవానంద మిది పొందనైతి
రాగము: ఆహిరి
రేకు: 0005-02
సంపుటము: 1-30

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ఆహిరి

చదవండి :  ఎక్కువ కులజుఁడైన హీన కులజుఁడైన - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: