ఆతుమ సంతసపెట్టుటది యెఱుక, తా- – అన్నమయ్య సంకీర్తన

ఆతుమ సంతసపెట్టుటది యెఱుక, తా- – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
ఆతుమ సంతసపెట్టుటది యెఱుక, తా-
నేతెరవు నొల్లకుండు టిదియే యెఱుక
॥చ1॥
ముంచినబంధములలో ముణుఁగుడువడక తా-
నంచల విడఁదన్ను టది యెఱుక
చంచలపువిషయాల సగ్గుడుముగ్గుడుగాక
యెంచిఁ హరిఁదలపోయు టిదియే యెఱుక
॥చ2॥
పాయనియర్ధములకు బంటుబంటై తిరుగక
ఆయతమై మోసపోని దది యెఱుక
పాయపుఁగామినులతోఁ బలుమారుఁ జేయుపొందు
హేయమనితలపోయు టిదియే యెఱుక
॥చ3॥
ధరమీఁదఁగల ప్రాణితతుల నొప్పించక
ఆరయఁగ సముఁడగు టది యెఱుక
గరిమల శ్రీవేంకటపతిదాసుఁడై
యిరవొంద సుఖించు టిదియే యెఱుక
రాగము: లలిత
రేకు: 0079-03
సంపుటము: 1-378

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, లలిత

చదవండి :  అన్నమయ్య 511వ వర్థంతి ఉత్సవాలు

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: