అయ్యా మానువఁగదవయ్య మనుజుఁడు – అన్నమయ్య సంకీర్తన

అయ్యా మానువఁగదవయ్య మనుజుఁడు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
అయ్యా మానువఁగదవయ్య మనుజుఁడు తన-
కయ్యపుఁగంగఁ గానఁడు
॥చ1॥
పాపపుణ్యలంపటుఁడైనా దష్ట-
రూపుడూ జన్మరోగి యటుగాన
పైపైనే ద్రవ్యతాపజ్వరము వుట్టి
యేపొద్దు వొడలెరఁగఁడు
॥చ2॥
నరకభవనపరిణతుఁడైనా కర్మ
పురుషుఁడు హేయభోగి యటుగాన
దురితపుణ్యత్రిదోషజ్వరము పట్టి
అరవెరమాట లాడీని
॥చ3॥
దేహమోహస్థిరుఁడైనా ని-
ర్వాహుఁడు తర్కవాది యటుగాన
శ్రీహరి వేంకటశ్రీకాంతునిఁ గని
వూహలఁ జేరనొల్లఁడు
రాగము: నాట
రేకు: 0049-03
సంపుటము: 1-300

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, నాట

చదవండి :  ఎన్ని భాధలఁబెట్టి - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: