
అన్నలంటాఁ దమ్ములంటా ఆండ్లంటా బిడ్డలంటా – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ అన్నలంటాఁ దమ్ములంటా ఆండ్లంటా బిడ్డలంటా వన్నెల నప్పులుగొన్నవారువో వీరు read ॥చ1॥ తెగనీక అప్పులెల్లాఁ దీసితీసి | వారు తగిలినఁ బెట్టలేక దాఁగి దాఁగి వెగటునఁ బారిపోఁగా వెంట వెంట | పెక్కు పగల నప్పులుగొన్న వారువో వీరు ॥చ2॥ సేయరానిపనులెల్లఁ జేసిచేసి | తవ- రాయడికి లోలోనే రాసిరాసి కాయములోచొచ్చిచొచ్చి కాఁచికాఁచి | మున్ను వ్రాయనిపత్రాల కాఁగేవారువో వీరు ॥చ3॥ దొరయై యప్పులవారిఁ దోసితోసి | యీ- పరిభవములనెల్లఁ బాసిపాసి సిరులవేంకటపతిఁ జేరిచేరి | యిట్టి … వరుసనే గెలిచినవారువో వీరు |
రాగము: వరాళి రేకు: 0036-05 సంపుటము: 1-224 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, వరాళి