
అటువంటివాఁడువో హరిదాసుఁడు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ అటువంటివాఁడువో హరిదాసుఁడు అటమటాలు విడిచి నాతఁడే సుఖి ॥చ1॥ తిట్టేటిమాటలును దీవించేమాటలును అట్టే సరెని తలఁచి నాతఁడే సుఖి పట్టి చంపేవేళను పట్టము గట్టే వేళ అట్టు నిట్టు చలించనిల యాతడే సుఖి ॥చ2॥ చేరి పంచదారిడినఁ జేదు దెచ్చి పెట్టినాను అరగించి తనివొందే యతఁడే సుఖి తేరకాండ్లఁ జూచిన తెగరాని చుట్టముల నారయ సరిగాఁజూచే యాతడే సుఖి ॥చ3॥ పొంది పుణ్యము వచ్చి పొరిఁ బాపము వచ్చిన- నందలి ఫలమొల్లని యాతడే సుఖి విందుగా శ్రీవేంకటాద్రి విభునిదాసులఁ జేరి అందరానిపద మందననాతఁడే సుఖి |
రాగము: లలిత రేకు: 0097-02 సంపుటము: 1-484 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, లలిత