అక్రిడిటేషన్‌ దరఖాస్తుకు డిసెంబర్‌ 5 చివరితేదీ

అక్రిడిటేషన్‌ దరఖాస్తుకు డిసెంబర్‌ 5 చివరితేదీ

కడప: 2015-16 సంవత్సరాలకు గాను అక్రిడిటేషన్‌ సౌకర్యం కోసం జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు డిసెంబర్‌ 5వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని అక్రిడిటేషన్‌ కమిటీ అధ్యక్షుడు, జిల్లా కలెక్టర్ కె.వి.రమణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

జిల్లా స్థాయిలో మూడేళ్లు, మండల స్థాయిలో రెండేళ్ళ పాటు పాత్రికేయ వృత్తిలో అనుభవం తప్పని సరిగా ఉండాలని తెలిపారు.

ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు విభాగంలో దరఖాస్తు చేసేవారు పేరుతో సహా ప్రచురితమైన 12 వార్తా కథనాల ప్రతులను దరఖాస్తుకు జతచేసి సమర్పించాలని సూచించారు.

చదవండి :  జగన్ పై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు

సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం, కడప నుంచి దరఖాస్తులను పొందవచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను అదే కార్యాలయంలో గడువులోపు అందజేయాలని తెలిపారు.

చివరి తేదీ తరువాత వచ్చిన దరఖాస్తులను ఎలాంటి పరిస్థితులలో పరిగణలోనికి తీసుకోమని పేర్కొన్నారు.

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *