
అంతయు నీవే హరి పుండరీకాక్ష – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీరఘురామా ॥చ1॥ కులమును నీవే గోవిందుఁడా నా- కలిమియు నీవే కరుణానిధీ, తలఁపును నీవే ధరణీధరా ,నా- నెలవును నీవే నీరజనాభా ॥చ2॥ తనువును నీవే దామోదరా, నా- మనికియు నీవే మధుసూధనా వినికియు నీవే విట్ఠలుఁడా,నా- వెనకముందు నీవే విష్ణుదేవుఁడా ॥చ3॥ పుట్టుగు నీవే పురుషోత్తమా కొన నట్ట నడుము నీవే నారాయణా, యిట్టె శ్రీవేంకటేశ్వరుఁడా నాకు నెట్టన గతి యింక నీవే నీవే |
రాగము: పాడి రేకు: 0080-04 సంపుటము: 1-385 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, పాడి