
అంగడి నెవ్వరు నంటకురో యీ – – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ అంగడి నెవ్వరు నంటకురో యీ – దొంగలఁ గూడిన ద్రోహులను ॥చ1॥ దోసము దోసము తొలరో శ్రీహరి – దాసానదాసుల దగ్గరక ఆసలనాసల హరినెఱఁగక చెడి వీసర పోయిన వెఱ్ఱులను ॥చ2॥ పాపము పాపము పాయరో కర్మపుఁ- దాపపువారము దగ్గరక చేపట్టి వేదపు శ్రీహరికథలు యేపొద్దు వినని హీనులము ॥చ3॥ పంకము పంకము పైకొనిరాకురో కొంకుఁగొసరులకూళలము వేంకటగిరిపై విభునిపుణ్యకథ లంకెల వినని యన్యులము |
రాగము: శ్రీరాగం రేకు: 0039-05 సంపుటము: 1-241 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం