Tags :వైకాపా

    రాయలసీమ

    జగన్ పాదయాత్ర మొదలయింది…

    కడప ఉక్కు పరిశ్రమ ఏమైంది? పల్లెల్లో పచ్చ మాఫియాలు రాజ్యమేలుతున్నాయి రాజధాని నిర్మాణంపై ప్రభుత్వానికి స్పష్టత లేదు 50 ఏళ్లకే ఉద్యోగులను ఇంటికి పంపేందుకు కుట్ర బహిరంగ సభలో జగన్ ఉద్వేగభరిత ప్రసంగం తొలిరోజు 8.2 కి.మీల నడక కడప : అనుకున్నట్లుగానే భారీ సందోహం మధ్య విపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర (ప్రజా సంకల్ప యాత్ర) ఈ రోజు ఇడుపులపాయ నుంచి ప్రారంభం అయింది. యాత్ర ప్రారంభానికి ముందర వైఎస్ సమాధిని కుటుంబ సభ్యులతో కలిసి […]పూర్తి వివరాలు ...

    రాయలసీమ వార్తలు

    మా పిల్లోల్లకు 48 గంటల్లో క్షమాపణ చెప్పాల

    చలసాని, శివాజీలకు బైరెడ్డి హెచ్చరిక అనంతపురం: మేధావిగా చెప్పుకునే చలసాని, సినీనటుడు శివాజి రాయలసీమ పిల్లోల్లపై జరిగిన దాడులపై 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో వాళ్ళ ఇళ్ళ దగ్గర విద్యార్థులు నిరసనలకు దిగుతారని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హెచ్చరించారు సోమవారం అనంతపురంలో చలసాని, శివాజీల ప్రోద్భలంతో విద్యార్థి సంఘ నాయకులు క్రిష్ణానాయక్‌, ప్రతాప్‌రెడిలప్డై జరిగిన దాడిని నిరసిస్తూ రాయలసీమకు చెందిన వివిధ సంఘాల నేతృత్వంలో మంగళవారం నగర పాలక సంస్థ […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    బాబు రాజానామా కోరుతూ రోడ్డెక్కిన వైకాపా శ్రేణులు

    ఓటుకు నోటు వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేయాలని కోరుతూ మంగళవారం జిల్లా వ్యాప్తంగా వైకాపా శ్రేణులు ర్యాలీలు, ఆందోళనలు  నిర్వహించాయి. కడపలో… కడప కలెక్టరేట్ దగ్గర మేయర్ సురేష్‌బాబు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ధర్నా చేశారు. అనంతరం మాట్లాడుతూ…తన అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఓటుకు నోటు వ్యవహారాన్ని రెండు రాష్ట్రాల సమస్యగా చిత్రీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూస్తున్నారని పేర్కొన్నారు. పులివెందులలో… అవినీతి చంద్రబాబు గద్దె దిగాలంటూ వైకాపా నేతలు, కార్యకర్తలు పులివెందులలో భారీ ర్యాలీ నిర్వహించారు. […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    కోస్తా వారు చేస్తున్న మరో మోసమే ‘పట్టిసీమ’

    కృష్ణా నీటిని పునః పంపిణీ చేయాల రాజధాని పారిశ్రామిక కారిడార్‌ కోసమే పట్టిసీమ ఓవైపు సీమ ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం.. మరో వైపు సీమ కోసమే పట్టిసీమ అనడం కుట్ర పట్టిసీమ ఉత్తర్వులో సీమకు నీరిస్తామన్న అంశాన్ని ఎందుకు పొందుపరచలేదో చెప్పాల రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు కడప: రాజధాని ప్రాంతం చుట్టూ ఏర్పాటయ్యే పారిశ్రామిక కారిడార్‌కు నీరందించడం కోసం రాయలసీమ పేరు చెప్పి కోస్తా వారు చేస్తున్న మరో మోసమే పట్టిసీమ అని ఏపీ రైతుసంఘం […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    జిల్లా అభివృద్ధికి పోరుబాటే శరణ్యం: అఖిలపక్షం

    మొత్తానికి కడప జిల్లాకు చెందిన నాయకులు జిల్లా అభివృద్ది కోసం సమాలోచనలు సాగించడానికి సిద్ధమయ్యారు. ఈ దిశగా అఖిలపక్షం గురువారం కడపలో సమావేశం నిర్వహించింది. జిల్లా అభివృద్ది కోసము పోరాటాలు చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులూ, రైతు సంఘాల నాయకులూ నొక్కి చెప్పారు. ఇది ఒక ముందడుగు… ఈ అడుగులు గమ్యం చేరే వరకు ఇలాగే సాగాలని జిల్లా ప్రజానీకం ఆకాంక్షిస్తోంది! కడప: రాయలసీమలో వెనుకబడిన కడప జిల్లాను అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వమే వివక్ష చూపుతోన్ననేపధ్యంలో […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    తాగే నీళ్ళ కోసం 14.40 కోట్లడిగితే 1.90 కోట్లే ఇచ్చారా!

    కడప: శుక్రవారం స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయితీరాజ్, జెడ్పీ అధికారులతో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులు చెప్పిన సమాచారం ఆసక్తికరంగా ఉంది. బోర్లలో అదనంగా పైపులు వేయడానికి, తాగునీటి రవాణాకు జిల్లాకు ఎన్ని నిధులు మంజూరయ్యాయో చెప్పాలని వైకాపా ప్రజాప్రతినిధులు కోరగా జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం రూ.14.40 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదించగా ప్రభుత్వం కేవలం రూ.1.90 కోట్లు మాత్రమే మంజూరు చేసిందని మరో రెండు కోట్లు […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    93 మందితో వైకాపా జిల్లా కార్యవర్గం

    కడప: 93 మంది సభ్యులతో కూడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ప్రకటించారు. పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారి పదిమంది ప్రధాన కార్యదర్శులు, పన్నెండు మంది కార్యదర్శులు, పద్దెనిమిది మంది సంయుక్త కార్యదర్శులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, కోశాధికారి, క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఇద్దరు, 44 మంది కార్యనిర్వాహక సభ్యులతో భారీ కార్యవర్గాన్ని ప్రకటించారు. స్థానిక వైఎస్ గెస్ట్‌హౌస్‌లో బుధవారం నగర మేయర్  కె.సురేష్‌బాబు, మైదుకూరు ఎమ్మెల్యే […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    కడప జిల్లాకు అన్యాయం చేస్తున్నారు

    కడప: జిల్లాలో వైకాపాకి ఆదరణ ఎక్కువ ఉందని చెప్పి ముఖ్యమంత్రి కడప జిల్లాకు పూర్తి అన్యాయం చేస్తున్నారని వైకాపా జిల్లా కన్వీనర్‌ అమరనాథరెడ్డి, కడప శాసనసభ్యుడు అంజాద్‌బాష, నగర మేయర్‌ సురేష్‌బాబులు ధ్వజమెత్తారు.  వైకాపా జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ… కడప విమానాశ్రయం పూర్తయి సంవత్సరం పూర్తి కావస్తున్నా ఇంత వరకు ప్రారంభించకపోవడం దారుణమన్నారు.ప్రభుత్వం ఏర్పడి 9 మాసాలు కావొస్తున్నా జిల్లాకు ఒక్కపైసా నిధులు మంజూరు చేయలేదన్నారు.  వస్తాయని భావిస్తున్న బ్రహ్మణి ఉక్కు ఫ్యాక్టరీని, […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    నాలుగోసారి పార్టీ మారనున్న కందుల సోదరులు

    కడప: ప్రస్తుతం వైకాపాలో ఉన్న కందుల సోదరులు భాజపాలో చేరనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా వీరు భాజపా నేతలతో జరుపుతున్న చర్చలు కొలిక్కి వచ్చినట్లు మీడియాలో కధనాలు వెలువడ్డాయి. కందుల రాజమోహన్‌రెడ్డి ఆ పార్టీ ముఖ్యనేతతో భేటీ అయ్యి, చేరిక తేదీని ఖరారు చేసుకున్నట్లు సమాచారం. జనవరి 9వ తేదీన విజయవాడకు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రానున్నారు. ఆయన సమక్షంలో చేరేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. ఒక వేళ అది కుదరకపోతే 18వ తేదీన కడప నగరంలో […]పూర్తి వివరాలు ...