కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతి రాజుతో, ఏఏఐ అధికారులతో మే 19న డిల్లీలో సమావేశమైన రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ వారంలో కడప విమానాశ్రయంలో ట్రయల్ రన్ నిర్వహిస్తామని, అనంతరం ఒక వారంలో కడప నుంచి విమానాలు నడుస్తాయని పత్రికలకు చెప్పారు. కడప విమానాశ్రయాన్ని ఏప్రిల్ 30న పరిశీలించిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) దక్షిణ ప్రాంత రీజినల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ నరసింహమూర్తి మే 10 నుంచి […]పూర్తి వివరాలు ...
Tags :విమానాశ్రయం
మొత్తానికి కడప జిల్లాకు చెందిన నాయకులు జిల్లా అభివృద్ది కోసం సమాలోచనలు సాగించడానికి సిద్ధమయ్యారు. ఈ దిశగా అఖిలపక్షం గురువారం కడపలో సమావేశం నిర్వహించింది. జిల్లా అభివృద్ది కోసము పోరాటాలు చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులూ, రైతు సంఘాల నాయకులూ నొక్కి చెప్పారు. ఇది ఒక ముందడుగు… ఈ అడుగులు గమ్యం చేరే వరకు ఇలాగే సాగాలని జిల్లా ప్రజానీకం ఆకాంక్షిస్తోంది! కడప: రాయలసీమలో వెనుకబడిన కడప జిల్లాను అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వమే వివక్ష చూపుతోన్ననేపధ్యంలో […]పూర్తి వివరాలు ...
DRDO వాళ్ళు ఎలెక్ట్రానిక్ వార్‌ఫేర్ లాబ్ నెలకొల్పడానికి ఒకేచోట 3,400 ఎకరాలు అవసరమై, ఏరికోరి కడప నగర శివార్లలోని కొప్పర్తిలో భూమి కావాలని కోరితే రాష్ట్రప్రభుత్వం ఇక్కడ భూమి ఇవ్వకుండా రాయలసీమలో ఇంకెక్కడైనా సరేనంటోంది. ఈ విషయంలో జోక్యంచేసుకుని, కొప్పర్తిలో కుదరకపోతే జమ్మలమడుగులోనైనా ఈ లాబ్ ఏర్పాటుచెయ్యమని రక్షణశాఖ మంత్రికి ఒక విన్నపం పంపేదానికి త్రివిక్రమ్ అనే ఆయన (ఈయన గతంలో కడపకు శివరామకృష్ణన్ కమిటీ వస్తోందని చివరి నిమిషంలో తెలిస్తే బెంగుళూరు నుండి అప్పటికప్పుడు వచ్చి […]పూర్తి వివరాలు ...
కడప జిల్లా వాసుల ఆశలన్నీ ఆవిరి కందుల సోదరులను భాజపాలో చేర్చుకోవడానికి మొన్న 18న కడపకొచ్చిన వెంకయ్య నాయుడు గారు కడప జిల్లా అభివృద్ధి విషయంలో మినుకుమినుకుమంటున్న ఆశల మీద నిర్దాక్షిణ్యంగా చన్నీళ్ళు గుమ్మరించి చక్కా వెళ్ళిపోయారు. కేంద్ర కేబినెట్లో ఆంధ్రప్రదేశ్ వాణిని బలంగా వినిపించగల నాయకుడిగా, చాలాకాలంగా ఈ ప్రాంత సమస్యలు, పరిస్థితుల గురించి అవగాహనతోబాటు బాధ్యతకూడా కలిగిన సీనియర్ నాయకుడిగా ఆయన్నుంచి కడప జిల్లావాసులు ప్రధానంగా కోరుకున్నది నాలుగు విషయాల్లో స్పష్టత – అవి: […]పూర్తి వివరాలు ...
ప్రారంభానికి సర్వమూ సిద్దమై చివరి నిమిషంలో ఆగిపోయిన (ప్రారంభం వాయిదా పడ్డ) కడప విమానాశ్రయం గురించి డైరెక్టరుగారు ఇచ్చిన సమచారమిది… ప్రశ్న: కడప విమానాశ్రయ ప్రస్తుత పరిస్తితి ఏమిటి? సమాధానం: విమానాశ్రయానికి సంబంధించిన రన్ వే, టెర్మినల్ భవనం, ఏటిసి (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) స్తూపాల నిర్మాణం పూర్తయింది. ప్రశ్న: కడప విమానాశ్రయం ఎప్పటి నుంచి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది? సమాధానం: సమాచారం అందుబాటులో లేదు ప్రశ్న: కడప విమానాశ్రయం ఎప్పటి నుంచి ప్రజలకు అందుబాటులోకి […]పూర్తి వివరాలు ...
గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారూ! రాష్ట్రం విడిపోయాక ముఖ్యమంత్రైన మీరు మొట్టమొదటిసారిగా నవంబర్ 8న కడప జిల్లాకు వస్తున్నారన్నప్పుడు పారిశ్రామిక రంగంలో మా జిల్లా రాష్ట్రంలోనే అట్టడుగున ఉంది కాబట్టీ, రాజధానిగా విజయవాడను నిర్ణయిస్తూ చేసిన ప్రకటనలో భాగంగా కడపజిల్లాలో ఖనిజాధారిత పరిశ్రమలు ఇబ్బడి ముబ్బడిగా నెలకొల్పుతామని ధారాళంగా మాట ఇచ్చారు కాబట్టీ జిల్లాను పారిశ్రామిక రంగంలో ఏ విధంగా “ముందుకు తీసుకుపోనున్నారో” మీకున్న “విజన్”తో ఒక రోడ్ మ్యాప్ ప్రకటించగలరని కొండంత ఆశతో ఎదురుచూశాం. అవేవీ […]పూర్తి వివరాలు ...
కడప విమానాశ్రయం ఈ నెల 14న ప్రారంభమవుతుందని ప్రకటించి చివర్లో ఆ కార్యక్రమం వాయిదా పడినట్లు మీడియాకు లీకులిచ్చారు. ఎందుకు వాయిదా పడింది అనే అంశంపై అటు ఏఏఐ అధికారులు కాని, ఇటు జిల్లా అధికారులు ఇంతవరకూ వివరణ ఇవ్వలేదు. ఎయిర్‌పోర్టులో రన్‌వే 8 సీటర్ విమానం దిగేందుకు అవసరమైన స్థాయిలోనే నిర్మించారని అందువల్లే విమానాశ్రయం ప్రారంభం వాయిదా పడిందని ఎంపిక చేసిన పత్రికల్లో కథనాలు వచ్చాయి. వెంటనే మంత్రి కిశోర్ బాబు మరో మూడు నెలలలో […]పూర్తి వివరాలు ...
కడప: వైఎస్ఆర్ జిల్లాకు రావలసిన పరిశ్రమలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని వైకాపా శాసనసభ్యుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్నాద్, కడప మేయర్ సురేష్ బాబులతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కడప విమానాశ్రయ ప్రారంభోత్సవం ఎందుకు ఆపారో తక్షణమే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 1985లోనే కడప విమానాశ్రయంలో 20 సీట్లున్న వాయుదూత్ విమానం దిగేదని, ఇప్పుడు ఆ సీట్ల గల విమానం కూడా దిగేందుకు […]పూర్తి వివరాలు ...
కడప: ఈనెల 14న కడపజిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు కడప విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చెప్పారు. నగరంలోని రాష్ట్ర అతిథి గృహంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన చంద్రబాబు పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తొలుత తిరుపతి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి రైల్వేకోడూరుకు ఉదయం 10.30 గంటలకు చేరుతారన్నారు. ఓబన్నపల్లెలో ఏర్పాటు చేసిన జన్మభూమి-మావూరు, ఇతర కార్యక్రమాల్లో దాదాపు రెండున్నర గంటల పాటు చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్‌లో […]పూర్తి వివరాలు ...