ఒక పడుచు పిల్లగాడు తన అందమైన పడుచు పెళ్ళాన్ని విడిచి వ్యాపారం కోసం పరాయిదేశం పోయినాడు. వాడు చెప్పిన సమయానికి రాలేదు. ఆలస్యంగా వచ్చిన మగడిని చూసి అలిగింది ఆ అందాలభామ. ఆ మగడు ఆమెను ఎలా అనునయించాడో, అలుక తీర్చాడో చూడండి. వర్గం: జట్టిజాం పాట (బృందగేయం) పాడటానికి అనువైన రాగం:తిలకామోద్ స్వరాలు (మధ్యాది తాళం) ఏమే రంగన పిల్లా నీ మకమే సిన్నబాయ – సెప్పే పిల్లా ఆలూరు సంతాకు పోతాన్ పిల్లా అడిగినన్ని […]పూర్తి వివరాలు ...
Tags :రాయలసీమ రాగాలు
ఒకప్పుడు రామాయణ, భారత, భాగవత కథలు జానపదుల జీవితంలో నిత్య పారాయణాలు. వారికి ఇంతకంటే ఇష్టమైన కథలు మరేవీ ఉండవేమో! పితృవాక్య పరిపాలనకై శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యాలకు వచ్చినాడు. ఆ సమయంలో భరతుడు అక్కడ లేడు. వచ్చిన తర్వాత జరిగిన ఘోరానికి బాధపడి తల్లి కైక దురాశను నిందించి అడవిలో అన్నను కలుసుకుంటాడు. భరతుని రాకకు సంతోషించిన రాముడు అయోధ్యలోని అందరి యోగక్షేమాలు అడిగినాడు. భరతుడు గుండెలవిసేట్లు ఏడుస్తూ తండ్రి చనిపోయిన విధం చెప్పి […]పూర్తి వివరాలు ...
రెండు చెక్కలను లయాత్మకంగా కొట్టడం ద్వారా అద్భుతమైన సంగీతాన్ని సృష్టించి దానికి అనుగుణంగా అడుగులు వేసే కళ చెక్కభజన . చెక్క భజనలో అడుగులకు అనుగుణంగా పాటలో వేగం, ఊపు, ఉంటాయి. చాలారకాల అడుగులున్నాయి . ఆది అడుగు, రెండు, మూడు, పర్ణశాల, కుప్పకొట్టడం, కులుకు వంటివి ప్రత్యేకమైన అడుగులు. ఈ అడుగులకు అనుగుణంగా చెక్కలు కొడుతుంటారు. గురువు మధ్యలో ఉండి పాట పాడతాడు. పాటలో వేగం పెరిగే కొద్దీ అడుగులు వేగంగా కదుల్తాయి. ఇటీవలి కాలంలో […]పూర్తి వివరాలు ...
ఆంధ్రప్రదేశ్‌లో జానపదబ్రహ్మగా ఖ్యాతి పొందిన మునెయ్య వాడవాడలా తిరిగి సేకరించిన జానపద గేయాలు వేనవేలు. ఔత్సాహిక కళాకారులెందరికో స్పూర్తి ప్రదాత. మునెయ్య కేవలం గాయకులే కాక మంచి రచయిత, చిత్రకారులు. వీరపునాయునిపల్లె శ్రీ సంగమేశ్వర ఉన్నత పాఠశాలలో చిత్రలేఖన ఉపాధ్యాయులుగా పనిచేశారు. 1943 సంవత్సరంలో కడప జిల్లాలో జమ్మలమడుగు తాలూకా దొమ్మరనంద్యాలలో జన్మించారు మునెయ్య. సరిగ్గా ఇది (2013) ఆయన 70వ జయంతి సంవత్సరం. అబ్బ శ్రీ కలిమిశెట్టి చౌడప్ప శిష్యరికంలో యక్షగానం, కోలాటం, పండరి భజన, […]పూర్తి వివరాలు ...