Tags :పుష్పగిరి ఆలయాలు

ఆచార వ్యవహారాలు

ఈ రోజు నుండి పుష్పగిరి బ్రహ్మోత్సవాలు

కడప: ఈ రోజు నుండి పుష్పగిరి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సురేష్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 4వ తేదీ బుధవారం క్షేత్రాధిపతి వైద్యనాధేశ్వరస్వామి, క్షేత్రపాలకుడు చెన్నకేశవస్వాముల గర్భాలయంలో గణపతి పూజలు, పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన, విశ్వక్షేనపూజ, మేధినీ పూజలతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. 5వ తేదీ సాయంత్రం కొండపై వెలసిన చెన్నకేశవస్వామి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం, హోమాలు ఉంటాయి. 8న చందనోత్సవం నిర్వహిస్తారు. అక్షతదియ తిరుణాల ఈ నెల 9న ప్రారంభమవుతుంది. […]పూర్తి వివరాలు ...

పర్యాటకం

పుష్పగిరి ఆలయాలు

వైష్ణవులకిది మధ్య ఆహోబిలమూ శైవులకిది మధ్య కైలాసమూ కడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో పుష్పగిరి క్షేత్రం కొండపై ఉంది. కింద పుష్పగిరి గ్రామం ఉంది. ఇది హరిహరాదుల క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో ప్రాచీన కాలంలో వందకు పైగా ఆలయాలు ఉండేవన్న పురాణగాధ ప్రచారంలో ఉంది. బ్రహ్మాండ, వాయు పురాణాల్లో ఈ క్షేత్ర మహిమను వ్యాస మహర్షి ప్రస్తావించారుట. ఆది శంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం, విద్యారణ్యస్వామి ప్రతిష్ఠించిన శ్రీచక్రంతో దర్శనీయ క్షేత్రంగా […]పూర్తి వివరాలు ...