తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు – జిల్లా నుండి గెలిచిన ఏకైక తెదేపా ఎమ్మెల్యే లింగారెడ్డి ప్రొద్దటూరు టిక్కెట్ విషయంలో వెన్నుపోటుకు గురయ్యారు. సుదీర్ఘ కాలం తెదేపాను అంటిపెట్టుకొన్న లింగారెడ్డిని కాదని కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి బాబు ప్రొద్దుటూరు టికెట్ కేటాయించారు. ఈ విషయం తెలిసీ లింగారెడ్డి ఇంటి వద్ద టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. పార్టీ సింబర్ సైకిల్‌ను సైతం మంటల్లో వేశారు. సీఎం రమేష్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున […]పూర్తి వివరాలు ...
Tags :తెదేపా
కడప జిల్లాలో మొత్తం పది శాసనభ నియోజకవర్గాలున్నాయి. ఈ పది నియోజకవర్గాలలో ప్రధాన పార్టీలైన వైకాపా, కాంగ్రెస్, తెదేపా+భాజపా మరియు జైసపాల తరపున బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు.పూర్తి వివరాలు ...
కడపలో ఐటీ పరిశ్రమను ఏర్పాటు చేసి ఐటీహబ్‌గా మార్చడంతో పాటు స్మార్ట్‌సిటీగా కడపను తయారు చేస్తానని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం మున్సిపల్ గ్రౌండ్లో జరిగిన ప్రజాగర్జన లో బాబు మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందిస్తానన్నారు. హైదరాబాద్‌ను తలదన్నేలా కడపను అభివృద్ధి చేసి హైటెక్‌సిటీని నిర్మిస్తామన్నారు. ఇక్కడ చదువుకున్న వారికి కడపలోనే ఉద్యోగాలు ఇచ్చేలా చేస్తానన్నారు. ఎందరో మహానీయులు జన్మించిన గడ్డ కడప, ఇలాంటి తులసి వనంలో […]పూర్తి వివరాలు ...
చంద్రబాబు తొమ్మిదేళ్ళ పాలనలో ఆంధ్రప్రదేశ్ దుస్థితిని గురించి ‘ది హిందూ’ రెసిడెంట్ ఎడిటర్ పాలగుమ్మి సాయినాద్ వ్యాఖ్యలు మీ కోసం … విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి ఇలా సకల రంగాలలో బాబు గారి గోబెల్ ప్రచారాన్ని ఎండగట్టిన ప్రసంగం…పూర్తి వివరాలు ...
తెదేపా అధినేత చంద్రబాబు ప్రజాగర్జన సభ కోసం 7న జిల్లాకు రానున్నారు. ఈ మేరకు చంద్రబాబు పర్యటన వివరాలు జిల్లా నాయకత్వానికి అధిష్ఠానం సమాచారం అందించింది. గతంలో మార్చి 27న నిర్వహించాలని ముందుగా భావించినా వాయిదా వేశారు. చంద్రబాబునాయుడు ప్రజాగర్జనను కడపలో ఏ మైదానంలో నిర్వహించాలి అనే అంశాన్ని జిల్లా కేంద్రంలోని నేతలు పరిశీలిస్తున్నారు. జిల్లాలో పార్టీ వ్యవహారాలు చూస్తున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కూడా చంద్రబాబు పర్యటనపై జిల్లా నేతలతో మాట్లాడినట్లు సమాచారం. ప్రజాగర్జనకు భారీగా […]పూర్తి వివరాలు ...
ఇటీవలే కాంగ్రెస్ నుండి తరిగి తెలుగుదేశంలో చేరిన కందుల రాజమోహన్‌రెడ్డి కడప లోక్‌సభ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే తెదేపా అధినేత చంద్రబాబును కలిసి ఈ విషయమై విన్నవించినట్లు ఆయన తెలిపారు. కడపలోని తన ఇంట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో మంచి నాయకుడు అవసరమన్నారు. బాబు సిఎం అయితే రాష్ట్రాభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. […]పూర్తి వివరాలు ...
ఎన్నికల పోరు సమీపిస్తున్న సందర్భంలో రాజకీయాలపై, పరిణామాలపై ఆసక్తి కాస్త అధికంగానే ఉంటుంది. టీ టైములో లేదా భోజన సమయంలో కలిసినప్పుడు సహోద్యోగుల మధ్య రాజకీయ చర్చలు నడవటం సర్వసాధారణం. ఈ చర్చలలో ఒక్కొక్కరివి ఒక్కో అంచనాలు. ఒక్కొక్కరివి ఒక్కో రకమైన అభిప్రాయాలు. ఈ మధ్య కాలంలో ఒక వింతైన, గమ్మత్తైన వాదన ఒకటి మేధావులుగా చలామణీ అవుతున్న ఒక వర్గం నోట తరచూ వినిపిస్తోంది – అదేమంటే ‘సదువుకున్న వాళ్ళెవరైనా వైకాపాకు ఓటేస్తారా?’ అని. ఇంకొంచెం గట్టిగా […]పూర్తి వివరాలు ...
తెదేపా అధినేత చంద్రబాబు పాలనలో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారని వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గుర్తు చేశారు. నాటి పాలనలో విసిగిపోయే వైఎస్‌కు అధికారం అప్పగించి.. ఎన్నో మేళ్లు పొందారని ఆమె కడపలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో వివరించారు. వివిధ కూడళ్లలో ఆమె రోడ్‌షోలు నిర్వహించారు. బిల్టప్, రామకృష్ణ పాఠశాల కూడలి, చెన్నూరు బస్టాండు, కృష్ణ చిత్రమందిరం, అప్సర కూడలి, ఆలంఖాన్‌పల్లెలో కార్యక్రమం కొనసాగించారు. ఆయా ప్రాంతాల్లో ఆమె చంద్రబాబుపై గురిపెట్టి ప్రసంగించారు. తెదేపా వ్యవస్థాపకుడు […]పూర్తి వివరాలు ...
కడప: జైసమైక్యాంధ్ర పార్టీలో చేరుతారని భావించిన కమలాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తెదేపాలో చేరుతున్నట్లు ఈ రోజు ప్రొద్దుటూరులో ప్రకటించారు. రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారకుడు జగన్మోహన్రెడ్డి అయితే…సీమాంధ్రను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చే సత్తా ఉన్న వ్యక్తి చంద్రబాబు అని వీరశివారెడ్డి ఈ సందర్భంగా అన్నారు. రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలోకి తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాంగ్రెస్ పార్టీ చీల్చి నాశనం చేసిందని ఆరోపించారు. అందుకే తాను కాంగ్రెస్‌ను వీడి తెదేపాలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి […]పూర్తి వివరాలు ...