॥పల్లవి॥నారాయణాయ నమో నమో నానాత్మనే నమోనమోయీరచనలనే యెవ్వరు దలఁచిన యిహపర మంత్రములిందరికి॥చ1॥గోవిందాయ నమో నమో గోపాలాయ నమో నమోభావజగురవే నమో నమో ప్రణవాత్మనే నమో నమోదేవేశాయ నమో నమో దివ్యగుణాయ నమో యనుచుయీవరుసలనే యెవ్వరు దలఁచిన యిహపరమంత్రము లిందరికి॥చ2॥దామోదరాయ నమో నమో ధరణీశాయ నమోనమోశ్రీమహిళాపతయే నమో శిష్ట రక్షిణే నమో నమోవామనాయ తే నమో నమో వనజాక్షాయ నమో నమోయీమేరలనే యెవ్వరు దలఁచిన యిహపరమంత్రము లిందరికి॥చ3॥పరిపూర్ణాయ నమో నమో ప్రణవగ్రాయ నమోనమోచిరంతన శ్రీ వేంకటనాయక శేషశాయినే నమోనమోనరకధ్వంసే […]పూర్తి వివరాలు ...
Tags :తాళ్ళపాక అన్నమయ్య
॥పల్లవి॥ఇందిరా నాయక యిదివో మాపాటుచెంది నీవే గతి చేకొనవయ్యాis-aber.net॥చ1॥తీసీఁ గోరికతీదీపు లొకవంకలాసీ సంసారలంపటముమూసీఁ గర్మము మునుకొని పరచింతసేసేదేమిఁకఁ జెప్పే దేమి॥చ2॥వంచీ నాసలు వలసినచోటికిపొంచీ దుర్గుణబోగములుముంచీ యౌవనమోహాంధకారముయెంచేదేమి సోదించేదేమి॥చ3॥యెఱిఁగీఁ జిత్తము యించుకించుక నిన్నుమఱవనినీపైభక్తి మతినుండఁగానెఱి శ్రీవేంకటపతి నీవే కాతువుగాకవెఱచి నేఁజేసే విన్నపమేమి రాగము: రామక్రియ రేకు: 0079-04 సంపుటము: 1-379 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఆతుమ సంతసపెట్టుటది యెఱుక, తా-నేతెరవు నొల్లకుండు టిదియే యెఱుక॥చ1॥ముంచినబంధములలో ముణుఁగుడువడక తా-నంచల విడఁదన్ను టది యెఱుకచంచలపువిషయాల సగ్గుడుముగ్గుడుగాకయెంచిఁ హరిఁదలపోయు టిదియే యెఱుక॥చ2॥పాయనియర్ధములకు బంటుబంటై తిరుగకఆయతమై మోసపోని దది యెఱుకపాయపుఁగామినులతోఁ బలుమారుఁ జేయుపొందుహేయమనితలపోయు టిదియే యెఱుక॥చ3॥ధరమీఁదఁగల ప్రాణితతుల నొప్పించకఆరయఁగ సముఁడగు టది యెఱుకగరిమల శ్రీవేంకటపతిదాసుఁడైయిరవొంద సుఖించు టిదియే యెఱుక రాగము: లలిత రేకు: 0079-03 సంపుటము: 1-378 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥మేదిని జీవులఁగావ మేలుకోవయ్యానీదయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా॥చ1॥తగుగోపికల కన్నుఁదామరలు వికసించెమిగుల సూర్యనేత్రుఁడ మేలుకోవయ్యాతెగువ రాక్షసులనే తిమిరము విరియఁగనెగడిన పరంజ్యోతి నిద్ర మేలుకోవయ్యా॥చ2॥ఘనదురితపు నల్లఁగలువలు వికసించెమినుకు శశివర్ణుఁడ మేలుకోవయ్యాపనివడి వేదాలనే పక్షులెల్లాఁ బలుకఁగజనక యాశ్రితపారిజాత మేలుకోవయ్య॥చ3॥వరలక్ష్మికుచచక్రవాకము లొండొంటి రాయమెరయు దోషారహిత మేలుకోవయ్యాపొరసి నీవు నిత్యభోగములు భోగించనిరతి శ్రీవేంకటేశ నేఁడు మేలుకోవయ్యా రాగము: భూపాళం రేకు: 0079-02 సంపుటము: 1-377 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥నీయాజ్ఞ దలమోచి నీ దేహధారి నైతియీయేడ గోవిందుఁడ నే నీడేరేదెట్లోread॥చ1॥తనువు వేసరినాను తలఁపు వేసరదుధనముగడించెడితరితీపునచెనకి మగఁడు విడిచిన మామ విడువని-పనియాయ హరి నాబదుకుజాడ యెట్లో॥చ2॥పాయము ముదిసిననాను భావము ముదియదువేయైనా సంసారవిషయాలనువోయయ్య కలివోసినావుట్లదిక్కు చూచేదిమాయదాయ నిఁక నామనసుజాడెట్లో॥చ3॥కడలేనినావిధులు కన్నులారఁ జూచి నీవునడుమ శ్రీవేంకటేశ నన్ను నేలితినొడుగులు దప్పినాను నోముఫలము దప్పని-అడియాల మబ్బె నాకు నానతిచ్చి తెట్లో రాగము: రామక్రియ రేకు: 0079-01 సంపుటము: 1-376 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, [&పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఇందునుండ మీ కెడ లేదుసందడి నేయక చనరో మీరుread॥చ1॥నాలుక శ్రీహరినామం బున్నదితూలుచుఁ బారరొ దురితములుచాలి భజంబున చక్రం బున్నదితాలిమి భవబంధము లటు దలరో॥చ2॥అంతర్యామై హరి వున్నాఁ డిదెచింతలు వాయరొ చిత్తమునవింతలఁ జెవులను విష్ణుకథ లివిగొపొంతఁ గర్మములు పోరో మీరు॥చ3॥కాపయి శ్రీవేంకటపతిపే రిదెనాపై నున్నది నయముననుకోపపుకామాదిగుణములాల మీ-రేపున కడఁగడ నెందైన బోరో రాగము: పాడి రేకు: 0078-06 సంపుటము: 1-375 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యాసన్నల నీ యోగనిద్ర చాలు మేలుకోవయ్యా॥చ1॥ఆవులు పేయలకుఁగా నఱచీఁబిదుకవలెగోవిందుఁడ యింక మేలుకొనవయ్యాఆవలీవలి పడుఛు లాటలు మరిగివచ్చిత్రోవగాచుకున్నారు ప్రొద్దున మేలుకోవయ్యా॥చ2॥వాడల గోపికలెల్లా వచ్చి నిన్ను ముద్దాడఁగూడియున్నా రిదే మేలుకొనయ్యాతోడనే యశోద గిన్నెతోఁ బెరుగు వంటకముయీడకుఁ దెచ్చిపెట్టె నిఁక మేలుకోవయ్యా॥చ3॥పిలిచీ నందగోపుఁడు పేరుకొని యదె కన్నుఁగొలుకులు నిచ్చి మేలుకొనవయ్యాఅలరిన శ్రీవేంకటాద్రిమీఁది బాలకృష్ణయిల మామాటలు వింటి విఁక మేలుకోవయ్యా రాగము: భూపాళం రేకు: 0078-05 సంపుటము: 1-374 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥పరుసమొక్కటేకాదా పయిఁడిగాఁ జేసేదిఅరయ లోహమెట్టున్నా నందుకేమి॥చ1॥వనజనాభువిభక్తి వదలకుండినఁ జాలుమనసు యెందు దిరిగినా మరియేమిమొనసి ముద్రలు భుజముల నుండితేఁ జాలుతనవెంతహేయమైనా దానికేమి॥చ2॥శ్రీకాంతునామము జిహ్వఁ దగిలితే జాలుయేకులజుఁడైనాను హీనమేమిసాకారుఁడైనహరి శరణుచొచ్చినఁ జాలుచేకొని పాపము లెన్ని చేసిననేమి॥చ3॥జీవుఁడెట్టున్నానేమి జీవునిలో యంతరాత్మశ్రీవేంకటేశున కాచింతయేమియేవలవఁ బరమైన యిహమైన మాకుఁ జాలుకైవశమాయ నతఁడు కడమలింకేమి రాగము: సామంతం రేకు: 0078-04 సంపుటము: 1-373 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥దేవ నీవిచ్చేయందుకు దీనికిఁగా నింతయేలయేవేళ మాయెరుకలు యెందుకుఁ గొలువును॥చ1॥యెవ్వరివసములు బుద్దెరిఁగినడచేమనయివ్వల నారాయణ నీవియ్యక లేదుదవ్వు చేరువ మనసు తనయిచ్చయితేఁ గనకరవ్వగ మృగాదులెల్ల రాజ్యమేలనేరవా॥చ2॥సారేకు నిన్నుఁదలపించ జంతువులవసమాకేరి నీవు జిహ్వఁ బరికించఁగాఁగాకయీరీతి లోకమెల్లాఁ దమయిచ్చకొలఁదులనయితేదూరానఁ గొక్కెరలు చదవవా వేదాలు॥చ3॥యిందరిపాపపుణ్యాలు యిన్నియు నీచేఁతలేకుందవ స్వతంత్రులు గారు గానచందపు శ్రీవేంకటేశ శరణంటి నిదె నీకుచెంది నీవే కాతుగాక చేఁతలూను వలెనా రాగము: బౌళి రేకు: 0078-03 సంపుటము: 1-372 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య […]పూర్తి వివరాలు ...