కొండపేట కమాల్ “నేను మా ఇంట్లో పెద్ద ఆద్దాలను అమర్చుకుని స్త్రీపాత్రల హావభావాలను, వివిధ రసాభినయాలాలో ముఖకవలికలను, ముస్తాబు తెరగులను, నవ్వులను, చూపులను, నడకలను కొన్నేళ్ళపాటు సాధన చేశాను. ఈ కమాల్ ఈ సౌకర్యాలను సమకూర్చుకునే ఆర్ధిక స్తోమత లేని వాడయినప్పటికీ హావభావ ప్రదర్శనలో నన్ను ముగ్ధుణ్ణి గావించాడు. ఈయన గానమాధుర్యం అసమానమైనది. ఈయన నిజంగా వరనటుడు.. ఈయనను గౌరవించుటకెంతో సంతోషిస్తున్నాను’’ ప్రఖ్యాత స్త్రీ పాత్రల నటుడు, పద్మశ్రీ స్థానం నరసింహారావు గారు తాడిపత్రిలోని ఒక రంగస్థల […]పూర్తి వివరాలు ...
Tags :తవ్వా ఓబుల్ రెడ్డి
మైదుకూరు పట్టణంలోని పోరుమామిళ్ళ రోడ్డులో కె.సి.కెనాల్ పక్కగా వెలసిన శ్రీ సదానంద ఆశ్రమానికి (సదానందమఠం) మైదుకూరు చరిత్రలో విశిష్టమైన స్థానం ఉంది. “పిచ్చమాంబ మఠం” “పిచ్చమ్మ మఠం” పేర్లతో ఈ ఆశ్రమం పిలువబడుతోంది. మైదుకూరు మండలం వనిపెంటలోని ఓ మరాఠీ కుటుంబంలో జన్మించిన పెద్దయార్యులు మొదటగా సదానందశ్రమాన్ని స్థాపించి ప్రజల్లో తాత్విక చింతన, ఆధ్యాత్మిక భావనలు పెంపొందించడానికి శ్రీకారం చుట్టారు. తండ్రి పెద్దయార్యుల భోధనలతో పిచ్చమాంబ ప్రభావితురాలైయ్యారు . ఆశ్రమం మరింతగా అభివృద్దిచెందడానికి విశేష కృషి చేశారు. […]పూర్తి వివరాలు ...
ముత్తులూరుపాడు (ఆంగ్లం : Muttulurupadu or Muthulurupadu) – కడప జిల్లా ఖాజీపేట మండలంలోని ఒక ఊరు. ఈ ఊరు ఖాజీపేట, మైదుకూరుల నడుమ చిత్తూరు – కర్నూలు జాతీయ రహదారి పై నుండి 2 కి.మీల దూరంలో ఉంది. స్థానికులు ఈ ఊరి పేరును ‘ముత్తులపాడు’ లేదా ‘ముత్తులుపాడు’ అని కూడా వ్యవహరిస్తుంటారు. ఊర్లో పోస్టాఫీసు, రెండు మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలు, పశువైద్యశాల ఉన్నాయి. ముత్తులూరుపాడులో వివిధ కులాలకు, మతాలకు చెందిన ప్రజలు కలిసిమెలిసి […]పూర్తి వివరాలు ...
సాహితీకారుడు సొదుంగోవిందరెడ్డితో తవ్వా ఓబుల్ రెడ్డి జరిపిన ఇంటర్వ్యూ కడప జిల్లా ఉరుటూరు . చోళుల కాలంనాటి శాసనాలు, ఆలయాలు కలిగిన ఊరే కాదు. సాహితీ దిగ్గజాలైన సొదుం సోదరులు జన్మించిన గ్రామం. వారి పేర్లు సాహితీలోకానికి చిరపరిచితం . వారే సొదుం గోవింద రెడ్డి , సొదుం జయరాం, సొదుం రామ మోహన్ లు. అభ్యుదయ సాహితీ చరిత్రలో తమదైన చెరగని ముద్ర వేశారు ఈసోదరత్రయం . వీరిలో జయరాం, రామమోహన్ బయటి ప్రపంచంలో తిరిగినవారు. […]పూర్తి వివరాలు ...
తెలుగు సినిమాకు ప్రపంచ ఖ్యాతి తీసుకురావడమే కాకుండా ఎన్టీఆర్ ,ఏయన్నార్ లాంటి సినీ నటులను ఆదరించి విజయా సంస్థ ద్వారా అవకాశాలు కల్పించి దారి చూపిన న బి.ఎన్. రెడ్డి, బి.నాగిరెడ్డి లాంటి మహనీయులు రాయలసీమలో పుట్టారు. కరువు ప్రాంతమైన కడప జిల్లాకు వన్నె తెచ్చారు. వారు సినీ నిర్మాణ రంగంలో విజయం సాధించారు. “చందమామ” లాంటి బాలల పత్రికను దేశంలోని అన్ని ప్రముఖ భాషల్లో ప్రచురించి సాహిత్య సేవ కూడా చేసారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను […]పూర్తి వివరాలు ...
ఐదు వందల ఏళ్లకు పైగా ఆధ్యాత్మికంగా , రాజకీయంగా సుదీర్ఘమైన చరిత్ర కలిగిన గంజికుంట నేడు పట్టించుకునేవారు కరువై క్రమక్రమంగా చీకటి పుటల్లోకి నెట్టివేయబడుతోంది. విజయనగర సామ్రాజ్య కాలంలో వనిపెంట , మైదుకూరు, దువ్వూరు ప్రాంతాలకు రాజకీయ కేంద్రంగా విలసిల్లిన గంజికుంట సీమ చరిత్రకు శ్రీకృష్ణ దేవరాయల, అచ్యుతదేవరాయల కాలంనాటి శిలాశాసనాలు(16వ శతాబ్దం ) ఆధారాలుగా నిలుస్తున్నాయి. బ్రిటీషువారి రికార్డులకు ఎక్కిన పాలెగాళ్ళు పట్రా విటలపతినాయుడు వెలమ వెంకోజీ నాయుడు , వన్నూరమ్మలు రాజకీయ కార్యకలాపాలకు గంజికుంట […]పూర్తి వివరాలు ...
‘రాయలసీమ వైభవం’ – రాయలసీమ ఉత్సవాల సావనీర్ . సంపాదకత్వం: తవ్వా ఓబుల్ రెడ్డి, ప్రచురణ : రాయలసీమ ఆర్ట్ థియేటర్ – జులై, 2008లో ప్రచురితం.పూర్తి వివరాలు ...
మారుతున్న ప్రజల జీవన విధానాలే మనుషుల్లో ఒకటిగా బతుకుతున్న పిచ్చుకలు కనుమరుగయ్యేలా చేస్తున్నాయని, జీవ వైవిధ్యానికీ , పర్యావరణ సమతుల్యానికి ఎంతగానో మేలు చేసే పిచ్చుకలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రముఖ రచయిత, పప్పన్నపల్లె పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తవ్వా ఓబుల్ రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా, మైదుకూరు మండల పరిధిలోని పప్పన్నపల్లె గ్రామ పంచాయతీలోని పప్పన పల్లె గ్రామంలో గల మండల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (H.W), అమ్మ సేవా సమితి ప్రపంచ పిచ్చుకల […]పూర్తి వివరాలు ...
కడప జిల్లా కథాసాహిత్యం నవల, కథానిక, నాటకం, నాటిక వంటి ఆధునిక రచన సాహిత్య ప్రక్రియల ఆవిర్భావం కడప జిల్లాలో కళింగాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలతో పోలిస్తే చాలా ఆలస్యంగా జరిగింది. కందుకూరి వీరేశలింగం పంతులు తొలి సాంఘిక నవల రాజశేఖర చరిత్ర (1878) వచ్చి, ఎనబై ఏళ్లు గడిచాకే, కడప జిల్లా సాహిత్యకారులు నవలా రచన ప్రయత్నాలు చేశారు. గురజాడ తొలి కథానిక దిద్దుబాటు (1910) తర్వాత ఏ యాభై ఏళ్లకో కడప జిల్లా సాహిత్య చరిత్రలో […]పూర్తి వివరాలు ...