గుడికూలును నుయి పూడును వడి నీళ్లం జెఱువు తెగును వనమును ఖిలమౌ చెడనిది పద్యం బొక్కటి కుడియెడమల చూడకన్న గువ్వలచెన్నా! సప్తసంతానాలు కొన్నింటిని పేర్కొని అవన్నీ ఒకనాటికి నశించిపోయేవే కాని చెడనిది పద్యం ఒక్కటే అని చెబుతున్నది గువ్వల చెన్న శతకం. ఇలాంటి ఆణిముత్యాలు మరికొన్ని ఉన్నాయీ శతకంలో. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారు ఈ శతకాన్ని అధిక్షేపశతకం క్రింద ప్రచురించారు. శతక రచనా కాలానికి చెందిన సామాజికాంశాలు ఈ శతకంలో చోటు చేసుకొన్నాయి. ‘ఆంధ్రుల సాంఘిక […]పూర్తి వివరాలు ...