Tags :కొరముట్ల శ్రీనివాసులు

రాజకీయాలు

కడప జిల్లాపరిషత్ ఏకగ్రీవం

కడప జిల్లా పరిషత్‌ పీఠం ఏకగ్రీవమైంది. జడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలని తెదేపా నేతలుచేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆ పార్టీ సభ్యులు ప్రమాణ స్వీకార అనంతరం ఓటింగ్‌ కన్నా ముందే సమావేశం నుంచి వెళ్లిపోయారు. దీంతో వైకాపా సభ్యులు జడ్పీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్‌గా ఎర్రగుంట్ల జడ్పీటీసీ సభ్యుడు గూడూరు రవి, వైస్‌చైర్మన్‌గా ఒంటిమిట్ట జడ్పీటీసీ సభ్యుడు ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కలెక్టర్‌ కోన శశిధర్‌ అధ్యక్షతన జడ్పీ పాలకవర్గం ఎన్నికలు జరిగాయి. […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

రోడ్డెక్కిన వైకాపా శాసనసభ్యులు

జమ్మలమడుగు: తెదేపా ప్రభుత్వం చౌకదుకాణాల డీలర్లపై తప్పుడు కేసులు బనాయించిందని, ఎలాంటి విచారణ లేకుండానే ఏకపక్షంగా తొలగించిదంటూ జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం ముందు సోమవారం వైకాపా శాసనసభ్యులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ముద్దనూరు రోడ్డుపై రెండు గంటల పాటు భైఠాయించి నిరసన తెలిపారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ప్రజలకు, వైకాపా కార్యకర్తలకు అన్యాయం జరిగితే అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తామని శాసనసభ్య్లులు ఆదినారాయణరెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, రఘురామిరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, జయరాముడు, అంజద్‌బాషా, ఎమ్మెల్సీ […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

చిన్నచౌకు కార్పోరేటర్ బరిలో సురేష్‌బాబు

వైకాపా తరపున కడప మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కొత్తమద్ది సురేష్‌బాబు నిన్న (బుధవారం) నామినేషన్ దాఖలు చేశారు. ఆయన చిన్నచౌకు పరిధిలోని నాలుగో డివిజన్ కార్పోరేటర్ పోటీ కోసం నామినేషన్ పత్రాలు సమర్పించారు. అట్టహాసంగా కార్యక్రమం సాగింది. ఆయన భార్య జయశ్రీ మరోసెట్ నామినేషన్ పత్రాలు అందించారు. ఈ  కార్యక్రమంలో తాజా మాజీ శాసనసభ్యులు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, డీసీసీబీ మాజీ ఛైర్మన్ కొల్లం బ్రహ్మానందరెడ్డి, పార్టీ నగర కన్వీనర్ అంజద్‌బాష, వైఎస్ అవినాష్‌రెడ్డి, […]పూర్తి వివరాలు ...