॥పల్లవి॥కనుఁగొనఁగ జీవుఁ డెరఁగఁడుగాక యెరిఁగిననుఆనవరతవిభవంబు లప్పుడే రావా॥చ1॥విసుగ కెవ్వరినైన వేఁడనేర్చన నోరుదెసలకును బలుమారుఁ దెరచు నోరువసుధాకళత్రుఁ దడవదుగాక తడవిననుయెసఁగఁ గోరికలు తన కిప్పుడే రావా॥చ2॥ముదమంది యెవ్వరికి మ్రొక్కనేర్చిన చేయిపొదిగి యధముల నడుగఁబూను చేయిఆదన హరిఁ బూజసేయదుగాక సేసిననుయెదురెదురఁ గోరికలు యిప్పుడే రావా॥చ3॥తడయకేమిటికైనఁ దమకమందెడి మనసుఆడరి యేమిటికైన నలయు మనసువడి వేంకటేశుఁ గొలువదుగాక కొలిచిననుబడిబడినె చెడనిసంపద లిట్లు రావా రాగము: శ్రీరాగం రేకు: 0062-04 సంపుటము: 1-319 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...
Tags :అన్నమయ్య సాహిత్యం
॥పల్లవి॥ఎక్కువ కులజుఁడైన హీన కులజుఁడైననిక్కమెరిఁగిన మహా నిత్యుఁడే ఘనుఁడు॥చ1॥వేదములు చదివియును విముఖుఁడై హరిభక్తియాచరించని సోమయాజికంటెయేదియునులేని కులహీనుఁడైనను విష్ణు_పాదములు సేవించు భక్తుఁడే ఘనుడు॥చ2॥పరమగువేదాంతపఠన దొరికియు సదాహరిభక్తిలేని సన్యాసికంటెసరవి మాలిన యంత్యజాతికులజుఁడైన_నరసి విష్ణునివెదకు నాతఁడే ఘనుఁడు॥చ3॥వినియుఁ జదివియును శ్రీ విభునిదాసుఁడుగాకతనువు వేఁపుచునుండుతపసికంటెయెనలేని శ్రీవేంకటేశుప్రసాదాన్న_మనుభవించినయాతఁ డప్పుడే ఘనుడు రాగము: సామంతం రేకు: 0062-03 సంపుటము: 1-318 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతంపూర్తి వివరాలు ...
॥పల్లవి॥తెలిసినఁ దెలియుఁడు తెలియనివారలుతొలఁగుఁడు బ్రహ్మదులె యెరుఁగుదురు॥చ1॥వరదుఁ డఖిలదేవలతకు వంద్యుఁడుగరదుఁడసురలకుఁ గంటకుఁడుపరమాత్ముఁడంబుజ భవశివాదులకుఁబరులకెల్ల మువ్వరలో నొకఁడు॥చ2॥దేవుఁడు సనకాదిమునులకునుఁ, బర-దైవ మఖిలవేదములకును,కైవల్యమొసఁగుఘననిధి, విధికిమ-హవిధి, జడులకు యాదవకులుఁడు॥చ3॥ఆద్యుఁడచలుఁడు మహభూత మితఁడ-భేధ్యుఁడ సాధ్యుఁడు భీకరుఁడుసద్య: ఫలదుఁడు సకలమునులకునువేద్యుఁడితఁడె పో వేంకటవిభుఁడు రాగము: నాట రేకు: 0062-02 సంపుటము: 1-317 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎంతగాలమొకదా యీ దేహధారణముచింతాపరంపరలఁ జిక్కువడవలనె॥చ1॥పడిగొన్న మోహంబువలలఁ దగులైకదాకడలేని గర్భనరకము లీఁదవలనెనడిమిసుఖములచేత ననుపుసేయఁగఁగదాతొడరి హేయపుదిడ్డిఁ దూరాడవలనె॥చ2॥పాపపుంజములచేఁ బట్టువడఁగాఁగదాఆపదల తోడిదేహము మోవవలనెచూపులకులోనైన సుఖము గానక కదాదీపనభ్రాంతిచేఁ దిరిగాడవలనె॥చ3॥హితుఁడైన తిరువేంకటేశుఁ గొలువకకదాపత్రిలేని నరకకూపమునఁ బడవలనెఅతనికరుణారసంబబ్బ కుండఁగఁగదాబతిమాలి నలుగడలఁ బారాడవలనె రాగము: శ్రీరాగం రేకు: 0062-01 సంపుటము: 1-316 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగంపూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎడమపురివెట్టె పరహితవివేకము, లోనగుడుసువడెఁ జదువు, మెరుఁగులువారెఁ జలముread॥చ1॥లంప మేయఁగఁదొణఁగె లలితంపుమతి లోనె,తెంపు దిగవిడిచె యెడ తెగనిమానంబు,చంప దొరకొనియె వేటలేని తమకంబు,యింపు ఘనమాయ నే నిఁకనేమి సేతు॥చ2॥బయలువందిలివెట్టు పనిలేనిలంపటము,దయ విడువఁదొడఁగె చిత్తములోనికాంక్ష,పయికొన్న మోహంబు పడనిపాట్లఁ బరచె,లయమాయ శాంతి మెల్లనె తీరె నెరుక॥చ3॥చావుఁబుట్టువు మఱచె సంసారబంధబు,దైవమును విడిచె యాతరికంపుఁబ్రియముశ్రీవేంకటేశ్వరుఁడు చిత్తరంజకుఁడు యిఁకఁగావలసినది యతనికరుణ ప్రాణులకు రాగము: ఆహిరి రేకు: 0061-06 సంపుటము: 1-315 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥దేవ దేవం భజే దివ్యప్రభావంరావణాసురవైరి రఘుపుంగవం॥చ1॥రాజవరశేఖరం రవికుల సుధాకరంఆజానుబాహు నీలాభ్రకాయంరాజారి కోదండ రాజదీక్షా గురుంరాజీవలోచనం రామచంద్రం॥చ2॥నీల జీమూత సన్నిభ శరీరం ఘనవిశాల వక్షం విమల జలజనాభంతాలాహి నగహరం ధర్మ సంస్థాపనంభూల లనాధిపం భోగిశయనం॥చ3॥పంకజాసన వినుత పరమ నారాయణంశంకరార్జిత జనక చాప దళనంలంకా విశోషణం లాలిత విభీషణంవేంకటేశం సాధు విబుధ వినుతం రాగము: ధన్నాశి రేకు: 0061-05 సంపుటము: 1-314 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥వెలికీ వెళ్ళఁడు చలికీ వెరవఁడువులికీ నులికీ నులికీనయ్యా॥చ1॥రోగియై తా రుచులఁ బాయఁడుభోగియై రతిపొందల్లఁడువేగి మిగిలిన వెడచీఁకటినీరుతాగీఁ దాగీఁ దాగీనయ్యా॥చ2॥తొడికీఁ దొడుకఁడు వుడికీ నుడుకఁడుకడికీఁ గసరఁడు కడుఁజేరఁడుమడికీ గుడికీ మానిన మమతలఁబుడికీఁ బుడికీఁ బుడికీనయ్యా॥చ3॥నిండీ నిండఁడు నెరసీ నెరయఁడుపండీఁ బండఁడు బయలీఁతలాఅండనె తిరువేంకటాధిపుఁ దలఁపుచునుండీ నుండీ నుండీనయ్యా రాగము: కన్నడగౌళ రేకు: 0061-04 సంపుటము: 1-313 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥నంద నందన వేణునాద వినోదముకుంద కుంద దంతహాస గోవర్ధనధరా॥చ1॥రామ రామగోవింద రవిచంద్రలోచనకామ కామకలుష వికారవిదూరాధామ ధామవిభవత్ర్పతాపరూప దనుజని-ర్ధూమధామ కరణచతుర భవభంజనా॥చ2॥కమల కమలవాస కమలారమణ దేవో-త్తమ తమో గుణసతతవిదూరప్రమదత్ర్పమదానుభవభావకరణసుముఖ సుధానంద శుభరంజనా॥చ3॥పరమ పరాత్పర పరమేశ్వరావరద వరదామల వాసుదేవచిరచిర ఘననగ శ్రీవేంకటేశ్వరనర హరినామ పన్నగశయనా రాగము: ధన్నాశి రేకు: 0061-03 సంపుటము: 1-312 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...
॥పల్లవి॥పాలదొంగవద్దవచ్చి పాడేరు తమ-పాలిటిదైవమని బ్రహ్మదులు॥చ1॥రోలఁ గటిపైంచుక పెద్దరోలలుగా వాపోవుబాలునిముందర వచ్చి పాడేరుఆలకించి వినుమని యంబరభాగమునందునాలుగుదిక్కులనుండి నారదాదులు॥చ2॥నోరునిండా జోల్లుగార నూఁగి ధూళిమేనితోపారేటిబిడ్డని వద్దఁ బాడేరువేరులేని వేదములు వెంటవెంటఁ జదువుచుఁజేరిచేరి యింతనంత శేషాదులు॥చ3॥ముద్దులు మోమునఁగార మూలల మూలలదాఁగే-బద్దులబాలునివద్దఁ బాడేరుఅద్దివో శ్రీతిరువేంకటాద్రీశుఁ డితఁడనిచద్దికి మేఁడికి వచ్చి సనకాదులు రాగము: మలహరి రేకు: 0061-02 సంపుటము: 1-311 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...