॥పల్లవి॥ఎండలోనినీడ యీమనసుపండు గాయసేయఁబనిలేదు మనసు॥చ1॥వానచేతకములవలెనాయ మనసుగోనెఁబట్టినబంకగుణమాయ మనసుమానఁజిక్కినకోలమతమాయ మనసుతేనెలోపలియీఁగ తెఱఁగాయ మనసు॥చ2॥గడిరాజుబదుకాయ కడలేని మనసునడివీది పెసరాయ నయమైన మనసుగడకుఁగట్టినపాఁతగతి దోఁచె మనసుఅడుసులోపలికంబమై తోఁచె మనసు॥చ3॥తెరవుచూపినజాడఁ దిరుగు నీమనసుమరుగఁజేసినచోట మరుగు నీ మనసుతిరువేంకటేశుపైఁ దిరమైన మనసుసిరిగలిగినచోటఁ జేరు నీమనసు రాగము: ఆహిరి రేకు: 0065-04 సంపుటము: 1-337 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ఆహిరిపూర్తి వివరాలు ...
Tags :అన్నమయ్య సాహిత్యం
॥పల్లవి॥పాయక మతినుండి పరగ మేలుఁగీడునుసేయించి కర్మిఁ దాఁ జేయు టెవ్వరిది॥చ1॥వెలయఁ జరాచర విఁభుడైన విభునాత్మఁదలఁచుఁగాక ప్రాణి దానేమి నేయుతెలిపి నిర్మలభక్తి దీపించి తనుఁజేరఁగొలిపించు కొనలేమి కొరత యెవ్వరిది॥చ2॥కొందరు సుఖులై కొదలేక మెలఁగఁగకొందరి దు: ఖపు కొరత యెవ్వరిదిఅందరి మతి వేంకటాద్రివల్లభ నీవుచెంది కర్మములఁ జేయుచేఁత యెవ్వరిది రాగము: కన్నడగౌళ రేకు: 0065-03 సంపుటము: 1-336 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥అందరిబ్రదుకులు నాతనివేకందువెల్ల శ్రీకాంతునిదే॥చ1॥వేమరుఁ జదివెడి విప్రుల వేదముసోముకవైరి యశోవిభవంశ్రీమించున మరల జీవనమెల్ల సు-ధామథనునిసంతత కరుణే॥చ2॥హితవగు నిలలో నీసుఖమెల్లనుదితి సుతదమనుఁడు దెచ్చినదేతతి తల్లి దండ్రి తానై కాచినరతి ప్రహ్లదవరదుని కృపే॥చ3॥ఆలరినయమరేంద్రాదుల బ్రదుకులుబలిబంధనుకృపఁ బరగినవేబలసి మునుల యాపదలు వాపుటకుబలునృపభంజను పరిణతలే॥చ4॥పూని యనాథుల పొందుగఁ గాచిన-జానకీవిభుని సరసతలేనానాభూభరణంబులు నందుని-సూనుఁడు చేసినసుకృతములే॥చ5॥తలకొని ధర్మము తానై నిలుపుటకలుషవిదూరునిగర్వములేనిలిచి లోకములు నిలిపినఘనుఁడగు.-కలియుగమున వేంకటపతివే రాగము: పాడి రేకు: 0065-02 సంపుటము: 1-335 Tags: Annamacharya Keerthanalu, Telugu పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఇందరికి నభయంబు లిచ్చుఁ జేయికందువగు మంచి బంగారు చేయి॥చ1॥వెలలేనివేదములు వెదకితెచ్చిన చేయిచిలుకుగుబ్బలికిందఁ జేర్చు చేయికలికియగు భూకాంతఁ గాఁగిలించిన చేయివలనైన కొనగోళ్ళవాఁడి చేయి॥చ2॥తనివోక బలిచేత దానమడిగిన చేయివొనరంగ భూదానమొసఁగు చేయిమొనసి జలనిధి యమ్ము మొనకుఁ దెచ్చిన చేయియెనయ నాఁగేలు ధరింయిచు చేయి॥చ3॥పురసతుల మానములు పొల్లసేసిన చేయితురగంబుఁ బరపెడిదొడ్డ చేయితిరువేంకటాచలధీశుఁడై మోక్షంబుతెరువు ప్రాణులకెల్లఁదెలిపెడి చేయి రాగము: సామంతం రేకు: 0065-01 సంపుటము: 1-334 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥చిరంతనుఁడు శ్రీవరుఁడుపరమం భవ్యం పావనం॥చ1॥వేదమయుఁడు కోవిదుఁడమలుఁడు పరుఁ-డాది పురుషుఁడు మహామహుఁడుయేదెస నేమని యేది దలఁచిన న-ఖేద మవాద మఖిల సమ్మతం॥చ2॥నిఖిలనిలయుఁడు మునివరదుఁడధికుఁడుమఖముఖ శుకాభిమతరతుఁడుశిఖరం శివం సుశీలన మతిశయ-ముఖరం ముఖ్యం మూలమిదం॥చ3॥అనేకప్రదుఁ డనాది నిధనుఁడుఘనుఁడీ తిరువేంకటవిభుఁడుదినం దినం సముదిత రవికోటి భ-జనం సిద్ధాంజనం ధనం రాగము: ముఖారి రేకు: 0064-06 సంపుటము: 1-333 Tags: Annamacharya Keerthanalu, Telugu పూర్తి వివరాలు ...
॥పల్లవి॥సకలసందేహమై జరగుచున్నది యెకటిప్రకటింప జీవమో బ్రహ్మమో కాని॥చ1॥వసుదేవుజఠరమనువననిధికిఁ జంద్రుఁడైఅసమానగతిఁ బొడమినాఁ డీతఁడువసుధఁ జంద్రుఁడు నీలవర్ణుఁ డేఁటికినాయకసరెత్తి ననుఁగందు గలయఁగొనుఁబోలు॥చ2॥ఇనవంశమున లోకహితకల్పభూజమైఆనఘఁడై జనియించినాఁ డీతఁడుననుపై నసురతరువు నల్లనేఁటికినాయపెనుఁగొమ్మలో చేఁగ పెరిగిరాఁబోలు॥చ3॥తిరువేంకటాద్రిపైఁ దెలియఁ జింతామణైఅరిదివలెఁ బొడచూపినాఁ డీతఁడుగరిమె నది యిపుడు చీఁకటివర్ణమేలాయహరినీలమణులప్రభ లలమికొనఁబోలు రాగము: శ్రీరాగం రేకు: 0064-05 సంపుటము: 1-332 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగంపూర్తి వివరాలు ...
॥పల్లవి॥పొరాక పోయి తలఁపుననున్న దైవంబుఁజేరనొల్లక పరులఁజేరఁదిరగెదము॥చ1॥వడిఁబారు పెనుమృగము వలలలోపలఁ దగులువడి వెడల గతిలేక వడఁకుచున్నట్లుచెడనికర్మములలోఁ జిక్కి భవములబాధఁబడియెదముగాక యేపనికిఁ దిరిగెదము॥చ2॥నీరులోపలిమీను నిగిడి యామిషముకైకోరి గాలము మ్రింగి కూలబఁడినట్లుజారిపోయిననేల సంసారసౌఖ్యవి-కారంపుమోహములఁ గట్టువడియెదము॥చ3॥శ్రీవేంకటేశు నాశ్రితలోకరక్షకునిభావింప దేవతాపతియైనవానిసేవించుభావంబు చిత్తమొడఁబడక నే-మీవలావలిపనుల నిట్లఁ దిరిగెదము రాగము: గుండక్రియ రేకు: 0064-04 సంపుటము: 1-331 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...
॥పల్లవి॥తెలిసియు నత్యంతదీనుఁడై తన్నుఁదెలియఁగఁగోరేటి తెలివే పో తెలివిread॥చ1॥వలచినసతి దన్ను వడిఁ గాలఁదన్నినఅలరి యెట్లా నుబ్బు నటువలెనేతలఁక కెవ్వరు గాలఁదన్నినా మతిలోనఅలుగక ముదమందునదివో తెలివి॥చ2॥అరిది మోహపు వనిత ఆలిపైఁ దిట్టిన…నరవిరై చొక్కినయుటవలెనేపరులు దన్ను వెలుపల నిట్లఁ బలికినఆరలేక రతిఁ జొక్కునదివో తెలివి॥చ3॥తనివోక ప్రియకాంత తమ్ములపురస మాన….ననయమును నటు గోరునటువలెనేతనర వేంకటపతిదాసుల ప్రసాదంబుఆనిశము ను గొనఁగోరునదివో తెలివి రాగము: బౌళి రేకు: 0064-03 సంపుటము: 1-330 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥కొంచెమును ఘనముఁ గనుఁగొననేల హరిఁదలఁచుపంచమహపాతకుఁడే బ్రహ్మణోత్తముఁడు॥చ1॥వేదములుచదివియును విముఖుఁడై హరికథలనాదరించనిసోమయాజికంటెయేదియునులేనికులహీనుఁడైనను విష్ణుపాదసేవకుఁడువో బ్రహ్మణోత్తముఁడు॥చ2॥పరమమగువేదాంతపఠన దొరకియు సదాహరిఁదలఁచలేని సన్న్యాసికంటెమరిగి పసురముఁదినెడిమాలయైనను వాఁడెపరమాత్ముఁ గొలిచినను బ్రహ్మణోత్తముఁడు॥చ3॥వినియుఁ జదివియు రమావిభునిఁ దలఁపక వృథాతనువు వేఁపుచుఁ దిరుగతపసికంటెచనవుగల వేంకటేశ్వరుదాసులకు వెంటఁబనిదిరుగునధముఁడే బ్రహ్మణోత్తముఁడు రాగము: శ్రీరాగం రేకు: 0064-02 సంపుటము: 1-329 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగంపూర్తి వివరాలు ...