॥పల్లవి॥పాపములే సంబళమెపుడూ యీ-యాపదఁబడి నే నలసేనా॥చ1॥ఎన్నిపురాణము లెటువలె విన్నామన్న మనువు దిమ్మరితనమేనన్ను నేనే కానఁగలేనట నావిన్న వినుకులకు వెఱచేనా॥చ2॥యెందరు వెద్దల నెట్లఁ గొలిచినానిందల నామతి నిలిచీనాకందువెఱిఁగి చీకటికిఁ దొలఁగనటఅందపుఁబరమిఁక నందేనా॥చ3॥తిరువేంకటగిరిదేవుఁడే పరమనిదరి గని తెలివిఁక దాఁగీనాతిరముగ నినుఁ జింతించినచింతేనిరతము ముక్తికి నిధిగాదా రాగము: శంకరాభరణం రేకు: 0013-06 సంపుటము: 1-82 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శంకరాభరణంపూర్తి వివరాలు ...
Tags :అన్నమయ్య సంకీర్తనలు
॥పల్లవి॥అప్పులవారే అందరునుకప్పఁగఁ దిప్పఁగఁ గర్తలు వేరీ॥చ1॥ఎక్కడ చూచిన నీ ప్రపంచమునఁజిక్కులు సిలుగులుఁ జింతలునేదిక్కెవ్వరు యీ తీదీపులలోదిక్కుముక్కులకు దేవుఁడెఁకాక॥చ2॥యేది దలంచిన నేకాలంబునుసూదులమూఁటల సుఖములివికాదన నౌననఁ గడ గనిపించఁగపోదికాఁడు తలఁపునఁ గలడొకఁడే॥చ3॥యెన్నఁడు వీడీ నెప్పుడు వాసీబన్నిన తమతమ బంధములువున్నతి సేయఁగ వొప్పులు నెరపఁగవెన్నుఁడు వేంకటవిభుఁడే కలఁడు రాగము: దేసాళం రేకు: 0013-05 సంపుటము: 1-81 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, దేసాళంపూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఆదిమపూరుషుఁ డచ్యుతుఁడచలుఁడనంతుఁడమలుఁడుఆదేవుఁ డీతఁడేపోహరి వేంకటవిభుఁడు॥చ1॥ఏకార్ణవమై ఉదకములేచిన బ్రహ్మాండములోఁబైకొని యుండఁగ నొక వటపత్రములోపలనుచేకొని పవళింపుచు నొక శిశువై వడిఁదేలాడిన-శ్రీకాంతుఁ డీతఁడేపో శ్రీవేంకటవిభుఁడు॥చ2॥అరుదుగ బలిమద మడఁపఁగ నాకసమంటిన రూపముసరుగన భూమింతయు నొక చరణంబున గొలచిపరగిన పాదాంగుటమున బ్రహ్మాండము నగిలించినపరమాత్ముఁ డీతఁడేపో పతి శ్రీవేంకటవిభుఁడు॥చ3॥క్షీరపయోనిధి లోపల శేషుఁడు పర్యంకముగాధారుణియును సిరియునుఁ బాదము లొత్తఁగనుచేరువఁదను బ్రహ్మాదులు సేవింపఁగఁ జెలుఁవొందెడినారాయణుఁ డితఁడే వున్నత వేంకటవిభుఁడు రాగము: శంకరాభరణం రేకు: 0013-04 సంపుటము: 1-80 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥దైవకృతంబట చేఁతట తనకర్మాధీనంబటకావలసినసౌఖ్యంబులు గలుగ కమానీనా॥చ1॥ఎక్కడిదుఃఖపరంపర లెక్కడిసంసారంబులుయెక్కడిజన్మము ప్రాణులకేలా కలిగినదియెక్కడిమోహవిడంబన యెక్కడియాశాబద్ధముయెక్కడికెక్కడ నిజమై యివి దానుండీనా॥చ2॥యీకాంతలు నీద్రవ్యము లీకన్నులవెడయాసలుయీకోరికె లీతలఁపులు యిట్టే వుండీనాయీకాయం బస్థిరమన కీదుర్దశలకు లోనైయీకల్మషములఁ బొరలఁగ నివి గడతేరీనా॥చ3॥దేవశిఖామణి తిరుమల దేవుని కృపగల చిత్తముపావనమై దురితంబులఁ బాయక మానీనాఆవిభుకరుణారసమున నతఁడే తను మన్నించినఆవేడుక లీవేడుక లాసలు సేసీనా రాగము: కన్నడగౌళ రేకు: 0013-03 సంపుటము: 1-79 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥అతిదుష్టుఁడ నే నలసుఁడనుయితర వివేకం బిఁకనేది॥చ1॥ఎక్కడ నెన్నిట యేని సేసితినొనిక్కపుఁదప్పులు నేరములుగక్కన నిన్నిట కలిగిననీవేదిక్కుగాక మరి దిక్కేది॥చ2॥ఘోరపుఁబాపము కోట్లసంఖ్యలుచేరువ నివె నాచేసినవినీరసునకు నిటు నీకృప నాకిఁకకూరిమి నా యెడ గుణమేది॥చ3॥యేఱిఁగి చేసినది యెఱఁగక చేసినకొఱతలు నాయెడఁ గోటు లివేవెఱపు దీర్చి శ్రీవేంకటేశ కావుమఱవక నాగతి మరి యేది రాగము: ఆహిరి రేకు: 0013-02 సంపుటము: 1-78 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఏఁటి విజ్ఞాన మేఁటి చదువుగూఁటఁబడి వెడలుగతిగురుతు గనలేఁడు॥చ1॥ఏడుమడుకలచర్మ మింతయునుఁ దూంట్లైగాడఁబెట్టుచుఁజీము గారఁగానుపాడైన యిందులో బ్రదుకుగోరీఁ బ్రాణివీడఁదన్ను కచనెడి వెరవు గనలేఁడు॥చ2॥కడుపునిండిన మహాకష్టంబు నలుగడలవెడలుచును బెనుమురుకి వేయఁగానుయిడుమఁ బొందుచు సుఖంబిందుకే వెదకీనివొడలు మోవఁగ జీవుఁడోపననలేఁడు॥చ3॥వుదకమయమగుకన్ను లురికి యేమైనఁగనిమదవికారము మతికి మరుపఁగానుయిది యెరిఁగి తిరువేంకటేశుఁగని జీవుఁడా-సదమలానందంబు చవిగానలేఁడు రాగము: గుండక్రియ రేకు: 0013-01 సంపుటము: 1-77 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, [&పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎంతైన దొలఁగవై తేదైన నామతికివింతచవిసేతుగా విషయబుద్ధి॥చ1॥ఎనసి జన్మముల నే నెట్ల నుండిన బోకవెనకఁ దిరుగుదువు గా విషయబుద్ధిఅనువైనయనుభవన లనుభవించఁగఁ జేసివెనక మఱపింతుగా విషయబుద్ధి॥చ2॥కెఱలి కాంతలు నేనుఁ గినిసిననుఁ బొలయలుకవిఱిచి కలపుదువుగా విషయబుద్ధితఱితోడ వావివ ర్తనదలంచిననన్నువెఱపు దెలుపుదువుగా విషయబుద్ధి॥చ3॥యెడలేనియాపదల నెట్లువొరలిన నన్నువిడిచిపోవైతిగా విషయబుద్ధిసడిఁబెట్టి వేంకటస్వామికృపచే నిన్నువిడిపించవలసెఁగా విషయబుద్ధి రాగము: దేసాక్షి రేకు: 0012-05 సంపుటము: 1-76 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందుప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సంస్తుత్యుఁడీ తిరువేంకటాద్రివిభుఁడుis-aber.net॥చ1॥ఏ మూర్తి లోకంబులెల్ల నేలెడునాతఁడేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాతఁ-డేమూర్తి నిజమోక్షమియ్యఁ జాలెడునాతఁడేమూర్తి లోకైకహితుఁడుయేమూర్తి నిజమూర్తి యేమూర్తియునుఁగాఁడు యేమూర్తి త్రైమూర్తి లేకమైనయాతఁడేమూర్తి సర్వాత్ముఁడేమూర్తి పరమాత్ముఁడామూర్తి తిరువేంకటాద్రివిభుఁడు॥చ2॥యేదేవుదేహమున నిన్నియును జన్మించెనే దేవుదేహమున నిన్నియును నణఁగె మరియేదేవువిగ్రహం బీసకల మింతయును యేదేవునేత్రంబు లినచంద్రులుయేదేవుఁడిజీవులిన్నింటిలో నుండు నేదేవుచైతన్య మిన్నిటికి నాధార-మేదేవుఁ డవ్యక్తుఁ డేదేవుఁ డద్వంద్వుఁడాదేవుఁ డీవేంకటాద్రివిభుఁడు॥చ3॥యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు యేవేల్పుపాదకేశాంతం బనంతంబుయేవేల్పు నిశ్వాస మీమహామారుతము యేవేల్పునిజదాసు లీపుణ్యులుయేవేల్పు సర్వేశుఁ డేవేల్పు పరమేశుఁడేవేల్పు భువనైకహితమనోభావకుఁడుయేవేల్పు కడుసూక్ష్మ […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎవ్వఁడో కాని యెరఁగరాదు కడు-దవ్వులనే వుండు తలఁపులోనుండు॥చ1॥ఎడయవు తనరెక్క లెగసిపోలేఁడుకడు దాఁగుఁగాని దొంగయుఁ గాడువడిఁ గిందుపడును సేవకుఁడునుఁ గాఁడువెడఁగుగోళ్ళు వెంచు విటుఁడునుఁ గాఁడు॥చ2॥మిగులాఁబొట్టివాఁడు మింటికినిఁ బొడవుజగడాలు తపసివేషములునుమగువకై పోరాడు మరి విరక్తుఁడునుతగుఁగాపుఁబనులు నెంతయుఁ దెల్లఁదనము॥చ3॥తరుణుల వలపించు తగిలి పై కొనఁడుతురగముఁ దోలు రౌతునుఁ గాఁడుతిరువేంకటాద్రిపైఁ దిరుగు నెప్పుడునుపరమమూర్తియై పరగు నీఘనుడు రాగము: రామక్రియ రేకు: 0012-03 సంపుటము: 1-74 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...