॥పల్లవి॥పారితెంచి యెత్తి వేసి పారవెళ్లితిని (వి?)నీరసపుటెద్దవైననీకు నే ముద్దా॥చ1॥ఎద్దవై నన్నేల తొక్కి యేమిగట్టుకొంటివివొద్దనైన వచ్చి వూరకుండవైతివివొద్దిక భూమెత్తిన యాయెద్దుకు నే ముద్దుగాకనిద్దురచిత్తముతోడినీకు నే ముద్దా॥చ2॥కాఁపురపుఁ బాపపునాకర్మమును ధరించివీఁపువగులఁగ దాకి విఱ్ఱవీఁగితిఆఁపఁగ నెద్దేమెఱుంగు నడుకులచవి మూట-మోపరివి నీకు నాముదము ముద్దా॥చ3॥మచ్చిరించి అల్లనాఁడు మాలవాఁడు కాలందన్నితెచ్చినయప్పటిధర్మ దేవతవుయెచ్చరించి తిరువేంకటేశుదాసుఁడని నన్నుమెచ్చి తాఁకితివి నామేను నీకు ముద్దా రాగము: భూపాళం రేకు: 0014-05 సంపుటము: 1-87 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...
Tags :అన్నమయ్య పాటలు
॥పల్లవి॥ఇతరము లిన్నియు నేమిటికిమతిచంచలమే మానుట పరము॥చ1॥ఎక్కడిసురపుర మెక్కడివైభవ-మెక్కడి విన్నియు నేమిటికియిక్కడనే పరహితమునుఁ బుణ్యముగక్కునఁ జేయఁగఁ గల దిహపరము॥చ2॥యెవ్వరు చుట్టము లెవ్వరు బంధువు-లెవ్వరిందరును నేమిటికిరవ్వగులక్ష్మీ రమణునిఁ దలఁపుచుయివ్వలఁ దాఁ సుఖియించుట పరము॥చ3॥యెందరు దైవము లెందరు వేల్పులుయెంద రిందురును నేమిటికికందు వెఱిఁగి వేంకటగిరిరమణునిచిందులేక కొలిచిన దిహపరము రాగము: సామంతం రేకు: 0014-04 సంపుటము: 1-86 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఇలయును నభమును నేకరూపమైజలజల గోళ్ళు జళిపైంచితివి॥చ1॥ఎడసిన నలముక హిరణ్యకశిపునిఁదొడికపట్టి చేతుల బిగిసికెడపి తొడలపై గిరిగొన నదుముకకడుపు చించి కహకహ నవ్వితివి॥చ2॥రొప్పుల నూర్పుల రొచ్చుల కసరులుగుప్పుచు లాలలు గురియుచునుకప్పినబెబ్బులిక సరుహుంకృతులదెప్పరపసురల ధృతి యణఁచితివి॥చ3॥పెళ పెళనార్చుచుఁ బెడబొబ్బలిడుచుథళథళ మెఱువఁగ దంతములుఫళఫళ వీరవిభవరసరుధిరముగుళగుళ దిక్కుల గురియించితివి॥చ4॥చాతినుప్రేవులజన్నిదములతోవాతెరసింహపువదనముతోచేతులు వేయిటఁ జెలగి దితిసుతునిపోతర మణఁపుచు భువి మెరసితివి॥చ5॥ఆహోబలమున నతిరౌద్రముతోమహామహిమల మలయుచునుతహతహ మెదుపు చుఁ దగువేంకటపతియిహముఁ బరముఁ మా కిపు డొసఁగితివి రాగము: నాట రేకు: 0014-03 సంపుటము: 1-85 Tags: Annamacharya Keerthanalu, Telugu […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥వెలయునిన్నియును వృధా వృధాతలఁపున శ్రీహరిఁ దడసినను॥చ1॥ఎడయలేనిపుణ్యము లెన్నియైనావిడువక సేయుట వృధా వృధాబడిబడి నే శ్రీపతి నాత్మలోఁదడవక యితరము దడవినను॥చ2॥యెరవులతపముల నెంతైనావిరవిరవీఁగుట వృధా వృధాహరినచ్యుతుఁ బరమాత్మునినిమరచి తలఁచక మఱచినను॥చ3॥దైవము నెఱఁగక తమకమునవేవేలైన వృధా వృధాశ్రీవేంకటగిరిచెలువునినిసేవించక మతిఁ జెదరినను రాగము: రామక్రియ రేకు: 0014-02 సంపుటము: 1-84 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, రామక్రియపూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎందుఁ బొడమితిమో యెఱఁగము మా-కందువ శ్రీహరికరుణేకాక॥చ1॥ఏఁటిజన్మమో యెఱఁగము పర-మేఁటిదో నే మెఱఁగముగాఁటపుకమలజుఁ గాఁచినయీనాఁటకుఁడే మానమ్మినవిభుఁడు॥చ2॥యెవ్వారు వేల్పులో యెఱఁగము సురలెవ్వరో నే మెఱఁగమురవ్వగు శ్రీసతిరమణుఁడు మా-కవ్వనజోదరుఁ డంతరియామి॥చ3॥యింకానేఁటిదో యెఱఁగము యీ –యంకెలబాముల నలయముజంకెల దనుజులఁ జదిపినతిరు-వేంకటేశుఁడు మావిడువనివిభుఁడు రాగము: ముఖారి రేకు: 0014-01 సంపుటము: 1-83 Tags: Annamacharya Keerthanalu, Telugu పూర్తి వివరాలు ...
॥పల్లవి॥పాపములే సంబళమెపుడూ యీ-యాపదఁబడి నే నలసేనా॥చ1॥ఎన్నిపురాణము లెటువలె విన్నామన్న మనువు దిమ్మరితనమేనన్ను నేనే కానఁగలేనట నావిన్న వినుకులకు వెఱచేనా॥చ2॥యెందరు వెద్దల నెట్లఁ గొలిచినానిందల నామతి నిలిచీనాకందువెఱిఁగి చీకటికిఁ దొలఁగనటఅందపుఁబరమిఁక నందేనా॥చ3॥తిరువేంకటగిరిదేవుఁడే పరమనిదరి గని తెలివిఁక దాఁగీనాతిరముగ నినుఁ జింతించినచింతేనిరతము ముక్తికి నిధిగాదా రాగము: శంకరాభరణం రేకు: 0013-06 సంపుటము: 1-82 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శంకరాభరణంపూర్తి వివరాలు ...
॥పల్లవి॥అప్పులవారే అందరునుకప్పఁగఁ దిప్పఁగఁ గర్తలు వేరీ॥చ1॥ఎక్కడ చూచిన నీ ప్రపంచమునఁజిక్కులు సిలుగులుఁ జింతలునేదిక్కెవ్వరు యీ తీదీపులలోదిక్కుముక్కులకు దేవుఁడెఁకాక॥చ2॥యేది దలంచిన నేకాలంబునుసూదులమూఁటల సుఖములివికాదన నౌననఁ గడ గనిపించఁగపోదికాఁడు తలఁపునఁ గలడొకఁడే॥చ3॥యెన్నఁడు వీడీ నెప్పుడు వాసీబన్నిన తమతమ బంధములువున్నతి సేయఁగ వొప్పులు నెరపఁగవెన్నుఁడు వేంకటవిభుఁడే కలఁడు రాగము: దేసాళం రేకు: 0013-05 సంపుటము: 1-81 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, దేసాళంపూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఆదిమపూరుషుఁ డచ్యుతుఁడచలుఁడనంతుఁడమలుఁడుఆదేవుఁ డీతఁడేపోహరి వేంకటవిభుఁడు॥చ1॥ఏకార్ణవమై ఉదకములేచిన బ్రహ్మాండములోఁబైకొని యుండఁగ నొక వటపత్రములోపలనుచేకొని పవళింపుచు నొక శిశువై వడిఁదేలాడిన-శ్రీకాంతుఁ డీతఁడేపో శ్రీవేంకటవిభుఁడు॥చ2॥అరుదుగ బలిమద మడఁపఁగ నాకసమంటిన రూపముసరుగన భూమింతయు నొక చరణంబున గొలచిపరగిన పాదాంగుటమున బ్రహ్మాండము నగిలించినపరమాత్ముఁ డీతఁడేపో పతి శ్రీవేంకటవిభుఁడు॥చ3॥క్షీరపయోనిధి లోపల శేషుఁడు పర్యంకముగాధారుణియును సిరియునుఁ బాదము లొత్తఁగనుచేరువఁదను బ్రహ్మాదులు సేవింపఁగఁ జెలుఁవొందెడినారాయణుఁ డితఁడే వున్నత వేంకటవిభుఁడు రాగము: శంకరాభరణం రేకు: 0013-04 సంపుటము: 1-80 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥దైవకృతంబట చేఁతట తనకర్మాధీనంబటకావలసినసౌఖ్యంబులు గలుగ కమానీనా॥చ1॥ఎక్కడిదుఃఖపరంపర లెక్కడిసంసారంబులుయెక్కడిజన్మము ప్రాణులకేలా కలిగినదియెక్కడిమోహవిడంబన యెక్కడియాశాబద్ధముయెక్కడికెక్కడ నిజమై యివి దానుండీనా॥చ2॥యీకాంతలు నీద్రవ్యము లీకన్నులవెడయాసలుయీకోరికె లీతలఁపులు యిట్టే వుండీనాయీకాయం బస్థిరమన కీదుర్దశలకు లోనైయీకల్మషములఁ బొరలఁగ నివి గడతేరీనా॥చ3॥దేవశిఖామణి తిరుమల దేవుని కృపగల చిత్తముపావనమై దురితంబులఁ బాయక మానీనాఆవిభుకరుణారసమున నతఁడే తను మన్నించినఆవేడుక లీవేడుక లాసలు సేసీనా రాగము: కన్నడగౌళ రేకు: 0013-03 సంపుటము: 1-79 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...