Tags :అన్నమయ్య పాటలు

సంకీర్తనలు

జడమతిరహం కర్మజంతురేకోహం – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥జడమతిరహం కర్మజంతురేకోహంజడధినిలయాయ నమో సారసాక్షాయ॥చ1॥పరమపురుషాయ నిజభక్తిజననసులభాయదురితదూరాయ సింధరహితాయనరకాంతకాయ శ్రీనారాయణాయ తేమురహరాయ నమో నమో నమో॥చ2॥నగసముద్ధరణాయ నందగోపసుతాయజగదంతిరాత్మాయ సగుణాయమృగనరాంగాయ నిర్మితభవాండాయ ప-న్నగరాజశయనాయ నమో నమో॥చ3॥దేవదేవేశాయ దివ్యచరితాయ బహు-భావనాతీతాయ పరమాయశ్రీవేంకటేశాయ జితదైత్యనికరాయభూవల్లభాయ నమో పూర్ణకామాయ రాగము: శ్రీరాగం రేకు: 0096-05 సంపుటము: 1-481 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

అరుదరుదు నీమాయ హరి హరీ – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥అరుదరుదు నీమాయ హరి హరీఅరసి తెలియరాదు హరిహరీ॥చ1॥అనంతబ్రహ్మండము లవె రోమకూపములఅనంతములై వున్నవి హరిహరీపొనిగి కుంగినవొక్క భూమి నీ వెత్తినది యే-మని నుతింతు నిన్ను హరి హరీ॥చ2॥పొదిగి బ్రహ్మదులు నీబొడ్డును నేకాలముఅదివో పుట్టుచున్నారు హరిహరీపొదలి యీజీవులను పుట్టించే యీసామర్థ్యముఅదన నేమనిచెప్పే హరి హరీ॥చ3॥పావనవైకుంఠము నీపాదమూల మందున్నదిఆవహించేభక్తిచేత హరి హరీశ్రీవేంకటాద్రిమీఁద చేరి నీ విట్టె వుండఁగా-నావల వెదకనేల హరిహరీ రాగము: బౌళి రేకు: 0096-04 సంపుటము: 1-480 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

కంటే సులభ మిది కానక యుంటే దుర్లభ: – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥కంటే సులభ మిది కానక యుంటే దుర్లభ:మింటిలోననే వున్న దిహముఁ బరమును॥చ1॥హరిదాసులు మెట్టినక్కడే పరమపద-మరయ నిందుకంటె నవల లేదుతిరమై వీరి పాదతీర్థమే విరజానదిసొరిది నన్ని చోట్లు చూచినట్టే వున్నది॥చ2॥మిచ్చక వైష్ణవుల మాటలెల్లా వేదములుయిచ్చల నిందుకంటే నింక లేదుఅచ్చట వీరిపస్రాద మమృతపానములుఅచ్చమై తెలిసేవారి కఱచేత నున్నది॥చ3॥చెలఁగి ప్రపన్నుల సేవే విజ్ఞానముఫల మిందుకంటే మఱి పైపై లేదుతలఁప శ్రీవేంకటేశుదాసులే యాతనిరూపు-లెలమి నెదుట నున్నా రెఱిఁగినవారికి రాగము: ముఖారి రేకు: 0096-03 సంపుటము: 1-479 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఆలవటపత్రశాయివైనరూప మిట్టిదని – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఆలవటపత్రశాయివైనరూప మిట్టిదనికొలువై పొడచుపేవా గోవిందరాజా॥చ1॥పడఁతులిద్దరిమీద బాదములు చాఁచుకొనివొడికపు రాజసాన నొత్తగిలికడలేని జనాభికమలమున బ్రహ్మనుకొడుకుఁగా గంటి విదె గోవిందరాజా॥చ2॥సిరులసొమ్ములతోడ శేషునిపైఁ బవళించిసొరిది దాసులఁ గృపఁ జూచుకొంటానుపరగుదైత్యులమీఁద పామువిషములే నీవుకురియించితివిగా గోవిందరాజా॥చ3॥శంకుఁజక్రములతోడఁ జాఁచినకరముతోడఅంకెల శిరసు కింది హస్తముతోడతెంకిన శ్రీవేంకటాద్రి దిగువతిరుపతిలోకొంకక వరములిచ్చే గోవిందరాజా రాగము: శంకరాభరణం రేకు: 0096-02 సంపుటము: 1-478 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శంకరాభరణంపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఇందులోనే కానవద్దా యితఁడు దైవమని – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఇందులోనే కానవద్దా యితఁడు దైవమనివిందువలె నొంటిమెట్ట వీరరఘురాముని॥చ1॥యెందు చొచ్చె బ్రహ్మవర మిల రావణుతలలుకందువ రాఘవుఁడు ఖండించునాఁడుముందట జలధి యేమూల చొచ్చెఁ గొండలచేగొందింబడఁ గట్టివేసి కోపగించేనాడు॥చ2॥యేడనుండె మహిమలు యిందరి కితఁడు వచ్చివేడుకతో హరివిల్లు విఱిచేనాఁడువోడక యింద్రాదు లెందు నొదిగి రీతనిబంటుకూడ బట్టి సంజీవికొండ దెచ్చేనాఁడు॥చ3॥జముఁ డెక్కడికిఁ బోయ సరయువులో మోక్ష-మమర జీవుల కిచ్చె నల్లనాఁడుతెమలి వానరులై యీదేవతలే బంట్లైరితిమిరి శ్రీవేంకటపతికి నేఁడు నాఁడు రాగము: నాట రేకు: 0096-01 సంపుటము: 1-477 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

దైవము పుట్టించినట్టి తన సహజమే కాక – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥దైవము పుట్టించినట్టి తన సహజమే కాకకోవిదునికైనా జాలిగుణ మేల విడుచు॥చ1॥ఆరయఁ బంచదార నద్దుక తినఁబోతేచేరరాని ముష్టిగింజ చేఁదేల మానుసారమైన చదువులు సారె సారెఁ జదివినాగోరపు దుష్టునికి కోపమేల మాను॥చ2॥నిప్పు దెచ్చి వొడిలోన నియమానఁ బెట్టుకొంటేయెప్పుడును రాఁజుఁగాక యిది యేల మానుముప్పిరిఁ బాతకుఁడైన మూఢుఁడెన్ని యాచారాలుతప్ప కెంతసేసినాను దయ యేల కలుగు॥చ3॥యింటిలోనఁ గొక్కు దెచ్చి యిరవుగఁ బెట్టుకొంటేదంటయై గోడలు వడఁదవ్వ కేలమానుగొంటరై శ్రీవేంకటేశుఁ గొలువకుండినవాఁడుతొంటి సంసారవుఁగాక దొర యేఁటి కౌను రాగము: ముఖారి రేకు: 0095-06 సంపుటము: 1-476 […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఏమి సేసినా నీరుణ మెట్టు వాసును – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఏమి సేసినా నీరుణ మెట్టు వాసునుకామితఫలద వోకరుణానిధి॥చ1॥చేరి కర్మములు నన్ను చెఱవట్టుకుండగానుపేరువాడి వచ్చి విడిపించుకొంటివిసారె తగవట్టె కాదా శక్తిగలవారెల్లానారయ దీనులఁ గంటే నడ్డమై కాతురు॥చ2॥అరులు పంచేంద్రియము లందు నిందుదియ్యఁగానువెరవుతోడ వెనక వేసుకొంటివిపరగ నట్టేకాదా బలువులైనవారుఅరయఁ బేదలకైన‌ ఆపద మానుతురు॥చ3॥పలుజన్మములే నన్ను పరి అరికట్టుకోఁగాతొలగదోసి నాకు దోడైతివియెలమి శ్రీవేంకటేశ యిల శూరులైనవారుబలుభయ మిందరికిఁ బాపుచుందురు రాగము: లలిత రేకు: 0095-05 సంపుటము: 1-475 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

రాముఁడిదే లోకాభిరాముఁ డితఁడు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥రాముఁడిదే లోకాభిరాముఁ డితఁడుగోమున పరశురాముకోప మార్చెనటరే॥చ1॥యీతఁడా తాటకిఁ జించె యీపిన్నవాడాఆతల సుబాహుఁ గొట్టి యజ్ఞముఁ గాచెచేతనే యీకొమరుఁడా శివునివిల్లు విఱిచెసీతకమ్మఁ బెండ్లాడె చెప్పఁ గొత్త గదవె॥చ2॥మనకౌసల్యకొడుకా మాయమృగము నేసెదనుజుల విరాధుని తానే చెఱిచెతనుమాడె నేడుదాళ్లు తోడనే వాలి నడఁచెయినకులుఁ డితఁడా యెంతకొత్త చూడరే॥చ3॥యీవయసుతానే యాయెక్కువజలధి గట్టిరావణు జంపి సీత మరలఁ దెచ్చెనుశ్రీవేంకటేశుఁ డితఁడా సిరుల నయోధ్య యేలెకావున నాటికి నేడు కంటి మిట్టె కదరే రాగము: సాళంగనాట రేకు: 0095-04 సంపుటము: 1-474 Tags: Annamacharya Keerthanalu, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఎంత భక్తవత్సలుఁడ విట్టుండవలదా – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఎంత భక్తవత్సలుఁడ విట్టుండవలదావింతలు నీసుద్దులెల్లా వినఁబోతే నిట్టివే॥చ1॥యిల నసురారియనేయీబిరుదు చెల్లె నీకుబలివిభీషణాదులపాలికే చెల్లదుకెలసి అవులే నీవు గెలుతు వెందరినైనాతలచి చూడ నీదాసుల కోడుదువు॥చ2॥యిందరిపాలిటికిని యీశ్వరుఁడ వేలికవుపందవై యర్జునుబండిబంట వైతివివందనకు నౌలే దేవతలకే దొరవుఅందపునీదాసులకు నన్నిటా దాసుఁడవు॥చ3॥కడుపులో లోకముకన్న తండ్రి విన్నిటానుకొడుకవు దేవకికిఁ గోరినంతనేతడవితే వేదములు తగిలేబ్రహ్మమవువిదువనిమాకైతే శ్రీవేంకటాద్రిపతివి రాగము: శంకరాభరణం రేకు: 0095-03 సంపుటము: 1-473 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, […]పూర్తి వివరాలు ...

error: