రెండో దఫా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తరువాత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పర్యటన అనే భావనను మార్చేశారు. అంతకు ముందు పల్లెబాట, నగరబాట, రైతు చైతన్యయాత్ర, పొలం బడి, రైతు సదస్సులు వంటివి నిర్వహించారు. రెండోసారి పదవిని చేపట్టిన తరు వాత ప్రజలతో ముఖాముఖీ సమావేశమై ప్రభుత్వ పథకాల గురించీ, అవి ప్రజలకు చేరుతున్న తీరు గురించీ, వాటితో చేకూరిన లబ్ధిని గురించీ, మంచిచెడుల గురించీ మాట్లాడాలని అనుకున్నారు. అలాగే భూపంపిణీ, ఇళ్లు, ఇళ్ల స్థలాల […]పూర్తి వివరాలు ...
Tags :ysrr
మా రాయలసీమ ముద్దు బిడ్డడు, మా భగీరధుడు, మా రాయలసీమ లో పుట్టి మా సీమ కరవుని తలచి, విచారించి మొత్తం తెలుగు నేల అంతా కరువు ఉండకూడదని కంకణం కట్టుకొని భగీరధ ప్రయత్నం చేసిన వాడు….మా సీమ నిండా సంతోషాల సిరులు కురవాలని మనసార ప్రయత్నం చేసిన వాడు….మా రాజశేఖరుడు….మా గుండెల్లో సదా స్ఫూర్తి నింపుతూ మమ్ములను నడిపించే చుక్కాని……ఆచంద్ర తారార్కం కీర్తింపబడువాడు నేడు వైఎస్ వర్ధంతి!… కడప జిల్లా ప్రజల తరపున ఆ మహనీయుడికిది […]పూర్తి వివరాలు ...
వైఎస్ హయాంలో కడప అభివృద్ధి వైఎస్‌గా చిరపరిచితుడైన కడప జిల్లాకు చెందిన దివంగత యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి గారు 14/05/2004 నుండి 02/09/2009 వరకు (సుమారుగా 5 సంవత్సరాల నాలుగు నెలల పాటు) అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. విధి నిర్వహణలో ఉండగానే అసువులు బాసిన వైఎస్ తన అయిదేళ్ళ పరిపాలనా కాలంలో కడప జిల్లాకు మంజూరు చేసిన/చేయించిన కొన్ని అభివృద్ది పనులు ఇవే… విద్యారంగం: యోగివేమన విశ్వవిద్యాలయం సిపిబ్రౌన్ భాషాపరిశోధనా కేంద్రానికి ఏటా ౩౦ లక్షల రూపాయల […]పూర్తి వివరాలు ...
నా అరవయ్యో యేట రాజకీయాలనుంచి వైదొలగుతాను- అన్నారు రాజశేఖరరెడ్డి ఆ మధ్య. ఈ మధ్య ఎవరో ఆ ప్రస్థావన తెస్తే “ఒకటి రెండు పనులు చక్కబెట్టి ఆ పని చేస్తాను” అన్నారు. కాని మృత్యువుకి ముందువెనుకలు నిర్దుష్టంగా తెలుసు. మృత్యువు కొన్ని జీవితాలకు అమోఘమైన డిగ్నిటీని యిస్తుంది. అనూహ్యమైన గ్లామర్ ని యిస్తుంది. ప్రజాస్పందననీ, ఆవేదననీ జత చేస్తుంది. ఒక్క మృత్యువుకే ఆ శక్తి వుంది. తప్పనిసరిగా విషాదం, ఆవేదన- ఆ వ్యక్తి మంచి చెడ్డలమీద మన్నికయిన […]పూర్తి వివరాలు ...
పరిస్థితులు అనుకూలించిన పరిధిలోనే అనతికాలంలో ఇన్ని మంచి పరిణామాలకు వైఎస్ సొంత చొరవతో దోహదం చేసినందువల్లే అమెరికన్ కాన్సల్ జనరల్ అక్కసుతో ఏకపక్ష ప్రతికూల నివేదికను పంపడానికి కారణమై ఉండాలి! ఇది పూర్తిగా దేశ, రాష్ట్ర ఆంతరంగిక వ్యవహారాల్లో పరాయిశక్తి జోక్యంగా భావించి, నిరసించాల్సిన పరిణామం. వ్యక్తిత్వాన్ని కోల్పోయి, పరదేశానికీ, పరదేశీకీ ‘జో హుకుం’ అనే పరాధీన పాలకులకీ, మడమ తిప్పకుండా తమ రాజకీయ వ్యక్తిత్వ విభవాన్ని ఇనుమడింపచేసుకునే ‘స్వాధీన’ పరిపాలకులకీ మధ్యన తేడా ఇదే! కేజీ […]పూర్తి వివరాలు ...
వైఎస్ హయాంలో కడప, పులివెందుల అభివృద్ధి కళ్లు చెదిరేలా ఉందంటూ… రాష్ట్రంలోని మిగతా జిల్లాల ప్రజల్లో అసంతృప్తి బీజాలు నాటేందుకు 2009 మే ఎన్నికల సందర్భంగా ‘ఈనాడు’ చేసిన అక్షర రాజకీయమిది. ఇప్పుడు అదే ‘ఈనాడు’ ఇడుపులపాయకు రోడ్డు లేదని, పంచాయతీ కార్యాలయం పెచ్చులూడిందని మరో రకం రాజకీయం మొదలుపెట్టింది. రామోజీకి ఎన్నికల సమయంలో ఎప్పుడూ ప్రకోపించే పైత్యంలో భాగంగానే వైఎస్‌కు కడపకు ఉన్న అనుబంధాన్ని అపహాస్యం చేస్తూ ఈ ఉప ఎన్నికల వేళ కథ(నా)లు రాస్తోంది. […]పూర్తి వివరాలు ...
కడప : కడప లోక్‌సభకు మే 8వ తేదీన జరగనున్న ఉప ఎన్నిక రసవత్తరం కానున్నది. 1989 సంవత్సరం జరిగిన ఎంపి ఎన్నికల నాటి నుంచి 2009 ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ కడప లోక్‌సభను హస్తగతం చేసుకుంది. కాగా దివంగత వైయస్‌రాజశేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యులే ఎంపిలుగా ఎన్నికయ్యారు. కాగా 1977 సంవత్సరంలో జరిగిన కడప లోక్‌సభ ఎన్నికలలో రెడ్డికాంగ్రెస్ అభ్యర్థి కందుల ఓబులరెడ్డి, జనతాపార్టీ అభ్యర్థి రామిరెడ్డిపై గెలుపొందారు.పూర్తి వివరాలు ...