Tags :ysr

ప్రత్యేక వార్తలు

తుమ్మలపల్లె యురేనియం శుద్ధి కర్మాగారం ప్రారంభం

కడప: వేముల మండలం తుమ్మలపల్లెలో నిర్మించిన యురేనియం శుద్ధి కర్మాగారాన్నిభారత అణుశక్తి సంఘం చైర్మన్ శ్రీకుమార్ బెనర్జీ శుక్రవారం ప్రారంభించారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఆల్కైన్ లీచింగ్ పద్ధతిలో దేశంలోనే మొదటిసారిగా వైఎస్సార్ జిల్లాలో యురేనియం శుద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము చేపట్టిన ప్రత్యేక చర్యల ఫలితంగా ఇక్కడ రేడియేషన్ ప్రభావం ఉండదని, పర్యావరణానికి ముప్పు వాటిల్లదని ఆయన పేర్కొన్నారు.పూర్తి వివరాలు ...

అభిప్రాయం

వైఎస్ స్వతంత్రుడు… అందుకే దాడి! – ఎ.బి.కె ప్రసాద్

పరిస్థితులు అనుకూలించిన పరిధిలోనే అనతికాలంలో ఇన్ని మంచి పరిణామాలకు వైఎస్ సొంత చొరవతో దోహదం చేసినందువల్లే అమెరికన్ కాన్సల్ జనరల్ అక్కసుతో ఏకపక్ష ప్రతికూల నివేదికను పంపడానికి కారణమై ఉండాలి! ఇది పూర్తిగా దేశ, రాష్ట్ర ఆంతరంగిక వ్యవహారాల్లో పరాయిశక్తి జోక్యంగా భావించి, నిరసించాల్సిన పరిణామం. వ్యక్తిత్వాన్ని కోల్పోయి, పరదేశానికీ, పరదేశీకీ ‘జో హుకుం’ అనే పరాధీన పాలకులకీ, మడమ తిప్పకుండా తమ రాజకీయ వ్యక్తిత్వ విభవాన్ని ఇనుమడింపచేసుకునే ‘స్వాధీన’ పరిపాలకులకీ మధ్యన తేడా ఇదే! కేజీ […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

క్రిమినల్ కేసుల్లో ఇరికించాలని సీబీఐ ముందుగానే నిర్ణయించుకుందని నాకు సమాచారముంది…

‘‘యూపీఏ ప్రభుత్వం తనను రాజకీయంగా కానీ, మరో రకంగానైనా కానీ ఏ రూపంలో వ్యతిరేకించే వారినైనా.. అణచివేయటానికి, అప్రతిష్టపాలు చేయటానికి, నిర్మూలించటానికి.. సీబీఐ, ఈడీ, ఐటీ తదితర సంస్థలను ఎలా దుర్వినియోగం చేస్తోందో మీ దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ లేఖ రాస్తున్నాను. యూపీఏ సర్కారు తీరు 1975 నాటి ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోంది. విస్తృత ప్రజాస్వామ్య ప్రయోజనాల కోసం ఈ నియంతృత్వ ధోరణులకు వ్యతిరేకంగా పోరాడేందుకు దేశంలోని అన్ని రాజకీయ పక్షాలూ ఏకం కావాల్సిన సమయం వచ్చింది.పూర్తి వివరాలు ...

వార్తలు

వైఎస్‌ను దొంగగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తే..

ఇడుపులపాయ: ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పాదయాత్రలు చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రెండు పర్యాయాలు అధికారాన్ని తెచ్చిపెట్టిన దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డిపై జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలు చూస్తుంటే బాధ కలుగుతోందని.. వైఎస్ సోదరుడు, మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్, ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డిలపై సీబీఐ దాడులు జరిపే కుట్రకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబే ప్రధాన సూత్రధారి అని నిప్పులు చెరిగారు. టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌కు స్వయానా బావ అయిన సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ లంచగొండి అని […]పూర్తి వివరాలు ...

వార్తలు

కడపజిల్లాపై చెరగని వైఎస్ ముద్ర.!

కడప జిల్లా నిర్లక్ష్యం నీడలో మగ్గుతుండేది. జిల్లా వాసి వైఎస్ 2004లో సీఎం అయ్యాక అభివృద్ధి పరుగులు తీసింది. మునిసిపాలిటీగా ఉన్న కడపను కార్పొరేషన్‌గాను, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, రాజంపేట మేజర్ పంచాయతీలను మునిసిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేశారు. జిల్లాలో యోగివేమన యూనివర్శిటీ, జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాల, పశువైద్య కళాశాలను నెలకొల్పారు. జిల్లా కేంద్రంలోరూ.130 కోట్లతో రిమ్స్ వైద్య కళాశాలపూర్తి వివరాలు ...

అభిప్రాయం

కడప గడప ముందు కుప్పిగంతులు!

వైఎస్ హయాంలో కడప, పులివెందుల అభివృద్ధి కళ్లు చెదిరేలా ఉందంటూ… రాష్ట్రంలోని మిగతా జిల్లాల ప్రజల్లో అసంతృప్తి బీజాలు నాటేందుకు 2009 మే ఎన్నికల సందర్భంగా ‘ఈనాడు’ చేసిన అక్షర రాజకీయమిది. ఇప్పుడు అదే ‘ఈనాడు’ ఇడుపులపాయకు రోడ్డు లేదని, పంచాయతీ కార్యాలయం పెచ్చులూడిందని మరో రకం రాజకీయం మొదలుపెట్టింది. రామోజీకి ఎన్నికల సమయంలో ఎప్పుడూ ప్రకోపించే పైత్యంలో భాగంగానే వైఎస్‌కు కడపకు ఉన్న అనుబంధాన్ని అపహాస్యం చేస్తూ ఈ ఉప ఎన్నికల వేళ కథ(నా)లు రాస్తోంది. […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

కడప లోక్‌సభ ఏడుసార్లు వైఎస్ కుటుంబ హస్తగతం

కడప : కడప లోక్‌సభకు మే 8వ తేదీన జరగనున్న ఉప ఎన్నిక రసవత్తరం కానున్నది. 1989 సంవత్సరం జరిగిన ఎంపి ఎన్నికల నాటి నుంచి 2009 ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ కడప లోక్‌సభను హస్తగతం చేసుకుంది. కాగా దివంగత వైయస్‌రాజశేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యులే ఎంపిలుగా ఎన్నికయ్యారు. కాగా 1977 సంవత్సరంలో జరిగిన కడప లోక్‌సభ ఎన్నికలలో రెడ్డికాంగ్రెస్ అభ్యర్థి కందుల ఓబులరెడ్డి, జనతాపార్టీ అభ్యర్థి రామిరెడ్డిపై గెలుపొందారు.పూర్తి వివరాలు ...