Tags :vontimitta

    ప్రత్యేక వార్తలు

    ఒంటిమిట్టలో టీవీ సినిమా చిత్రీకరణ

    ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి దేవళంలో బుధవారం ఉదయం అన్నమయ్య సంకీర్తనల టీవీ సినిమా చిత్రీకరణ జరిగింది. ఆలయ రంగమంటపంలో కొలువరో మొక్కురో.. అనే అన్నమయ్య సంకీర్తనను ఆలపించే దృశ్యాన్ని దర్శకుడు ప్రతాప్‌ చిత్రీకరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిపై తాళ్ళపాక అన్నమాచార్యులు రచించిన సంకీర్తనలను దృశ్య రూపంలో చిత్రీకరిస్తున్నామన్నారు. షూటింగ్‌ పూర్తయ్యాక ఈ టెలీ ఫిలింను శ్రీవారి పాదాల చెంత వుంచి టీటీడీకి అందజేస్తామన్నారు. అంతకుముందు యూనిట్‌ సభ్యులు స్వామిని […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    ఒంటిమిట్టలో కృష్ణంరాజు

    భాజపా రాష్ట్ర నాయకుడు, సీనియర్ సినీ నటుడు కృష్ణంరాజు గురువారం ఒంటిమిట్ట కోదండరామాలయాన్నీ సతీసమేతంగా సందర్శించారు. ఆయనకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేయించారు. ఆలయ అధికారులు పూలమాల, దుశ్శాలువాలతో కృష్ణంరాజు దంపతులను సత్కరించారు. అనంతరం కడపలోని అమీన్‌పీర్ (పెద్ద ) దర్గాను  దర్శించుకున్నారు. భార్య శ్యామలాదేవితో కలసి ఆయన దర్గాలోని ప్రధాన మజార్ వద్ద ప్రార్థనలు చేశారు. దర్గా ప్రాంగణంలోని ఇతర […]పూర్తి వివరాలు ...

    చరిత్ర వ్యాసాలు

    భాగవతం పుట్టింది ఒంటిమిట్టలో..!

    – విద్వాన్ కట్టా నరసింహులు బమ్మెరపోతన ఆంధ్రమహాభాగవత రచనకు కొన్నాళ్లముందు చంద్రగ్రహణం నాడు గంగలో స్నానం చేసి ధ్యానం చేస్తున్నాడు. అది మహేశ్వర ధ్యానం. ధ్యానంలో దర్శనమిచ్చినవాడు శ్రీరామభద్రుడు. భాగవతం రచించమన్నాడు. ఆయనకు కలలో కనిపించిన రాముడిలా ఉన్నాడు: మెఱుగు చెంగట నున్న మేఘంబు కైవడి ఉవిద చెంగట నుండ నొప్పువాడు చంద్రమండల సుధా సారంబు పోలిక ముఖమున చిఱునవ్వు మొలచువాడు వల్లీయుత తమాల వసుమతీజము భంగి బలువిల్లు మూపున బఱగువాడు నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి […]పూర్తి వివరాలు ...

    అభిప్రాయం పర్యాటకం

    “కడప దేవుని గడప” అని ఎందుకంటారో …

    ఒంటిమిట్ట – దీన్నే ఏకశిలానగరం అంటారు. త్రేతాయుగంలో సీతారామలక్ష్మణులు వనవాసం చేస్తున్న సమయంలో ఇక్కడకు వచ్చి దీనిపైన మూడురోజులు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. అప్పటికి ఇంకా వారికి ఆంజనేయస్వామీ పరిచయం కాకపోవటంతో ఇక్కడ సీతారామలక్ష్మణుల విగ్రహాలే ఉంటాయి. ఆంజనేయస్వామీ విగ్రహం విడిగా ఆలయఆవరణలో ఒకప్రక్కన ఉంటుంది. ఈ విగ్రహాలను జాంబవంతుడు ప్రతిష్ట చేసాడని అంటారు. ఈ క్షేత్రానికి చాలా ప్రశస్తి ఉంది. పోతన ఇక్కడే ఉండి భాగవతాన్ని వ్రాసాడని చెప్తారు. ఆయన నివసించిన ఇల్లు కూడా ఉందికాని […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    నేడు ఒంటిమిట్ట సీతారాముల పెళ్లి ఉత్సవం

    ఒంటిమిట్ట: కౌసల్య దశరథమహారాజు తనయుడు శ్రీరామచంద్రమూర్తికి జనక మహారాజు తనయ సీతామహాదేవితో స్వస్తిశ్రీ శ్రీనందననామ సంవత్సర ఉత్తరాయణే, వసంత రతువే, చైత్రమాసే చతుర్ధశి గురువారం సరియగు 5వ తేదీ రాత్రి 10 గంటలకు కల్యాణం జరుగులాగున దేవదేవులు నిర్ణయించారు. అత్యంత వైభవంగా, కనుల పండువగా నిర్వహించనున్న శ్రీరామచంద్రమూర్తి కల్యాణోత్సవానికి వీక్షించి, పులకించ మనవి.పూర్తి వివరాలు ...

    ఆలయాలు పర్యాటకం

    అపర అయోధ్య.. ఒంటిమిట్ట

    అపర అయోధ్యగా కొనియాడబడుతున్న ఏకశిలానగరం ఒంటిమిట్ట క్షేత్రానికి సంబంధించి పురాణ, చారిత్రక విశేషాలున్నాయి. బహుళ ప్రచారంలో ఉన్న కథనాల కన్నా మరింత ఆసక్తిదాయకమైన విశేషాలు కూడా ఉన్నాయి. శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాల సందర్భంగా కొన్ని విశేషాలు … ఒంటిమిట్టలో మాత్రమే… రాత్రిపూట కల్యాణం సాధారణంగా అన్ని దేవాలయాల్లోనూ దేవతామూర్తుల కల్యాణోత్సవాలను పగలు మాత్రమే నిర్వహిస్తారు. కానీ కేవలం ఒంటిమిట్ట క్షేత్రం లో మాత్రమే రాత్రి 11 గంటల తర్వాత నిర్వహిస్తారు. దీనికో పురాణగాథ ఉందని పరిశోధకులు చెబుతున్నారు. […]పూర్తి వివరాలు ...

    వ్యాసాలు సాహిత్యం

    కడప జిల్లాలో రామాయణ రచనా పరిమళం

    కడప: తిరుమల తర్వాత అంతటి గొప్ప క్షేత్రంగా దేవుని కడపను చెప్పినట్టే.. భద్రాచలం తర్వాత ఒంటిమిట్టకు అంత ప్రశస్తి ఉందంటారు. వాస్తవానికి భద్రాద్రి కన్నా ఒంటిమిట్ట ఎంతో పురాతనమైనది. దీన్ని రెండవ భద్రాద్రి అనడం కన్నా భద్రాచలాన్నే రెండవ ఒంటిమిట్టగా పేర్కొనడం సమంజసమంటారు ఇక్కడి పురాణ ప్రముఖులు. ఒంటిమిట్టలాంటి గొప్ప క్షేత్రమున్న ఈ జిల్లాలో శ్రీరాముని పవిత్ర హస్త స్పర్శతో పునీతమైన క్షేత్రాలుగా పేరుగాంచిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి ప్రొద్దుటూరులోని ముక్తిరామేశ్వరాలయం. ఈ ఆలయంలోని […]పూర్తి వివరాలు ...