తితిదే అధికారుల నిర్వాకమే కారణం పులివెందుల: మండలంలో ఉన్న గండిదేవస్థానం ఎట్టకేలకు తితిదే నుంచి విముక్తమై దేవాదాయశాఖలోకి విలీనమైంది. శనివారం తితిదే అధికారులు స్థానిక నాయకుల సమక్షంలో దేవాదాశాఖ అసిస్టెంట్ కమిషనర్ పట్టెం గురుప్రసాద్‌కు రికార్డులు అందజేశారు. నిర్వహణతో పాటు భక్తులకు సౌకర్యాలు మెరుగుపడతాయనే ఉద్దేశంతో 2007లో దేవాదాయ శాఖలో ఉన్న గండిక్షేత్రాన్ని తితిదేలోకి విలీనం చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. ఉత్తర్వులు జారీ చేశారు. మొదట్లో ఆలయ నిర్వహణ విషయంలో శ్రద్ధ చూపిన తితిదే అధికారులు 2009 […]పూర్తి వివరాలు ...
Tags :ttd
మాట తప్పిన ప్రభుత్వం తితిదే అజమాయిషీలోకి కోదండరామాలయం కోదండరామయ్య బాగోగులకు ఇక కొండలరాయుడే దిక్కు ఒంటిమిట్ట: వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఒంటిమిట్టను మరో తిరుమలలా అభివృద్ది చేస్తానంటూ పోయిన బ్రహ్మోత్సవాల సందర్భంగా గొప్పలు పోయిన ముఖ్యమంత్రి చివరకు ఆ భాద్యత నుండి తప్పుకుని ఒంటిమిట్ట కోదండరాముని భారాన్ని కోనేటి రాయుడికి అప్పగించి చేతులు దులుపుకున్నారు. కడప జిల్లాలోని పురాతన ఆలయమైన ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని తితిదేలో విలీనం చేస్తున్నట్టు ఆ సంస్థ పాలకమండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి […]పూర్తి వివరాలు ...
మైదుకూరు: తెదేపా మైదుకూరు నియోజకవర్గ భాద్యులు పుట్టా సుధాకర్‌యాదవ్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యునిగా రాష్ట్రప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జె.ఎస్.వి.ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. సుధాకర్ గత ఎన్నికల్లో తెదేపా తరఫున మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. సుధాకర్‌యాదవ్ నియామకంపై జిల్లాకు చెందిన పలువురు తెదేపా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడికి సుధాకర్ యాదవ్ వియ్యంకుడు. యనమల సిఫార్సు ఆధారంగానే సుధాకర్ తితిదే […]పూర్తి వివరాలు ...
కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కల్యాణాన్ని తితిదే ఆధ్వర్యంలో ఆదివారం వీరబల్లిలో వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు వీరబల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం వేదిక కానుంది. ఇందుకు సంబంధించి తిరుమల, తిరుపతి దేవస్థాన కల్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీనివాస కల్యాణం, అనంతరం అన్నప్రసాదాలు, అమ్మవారి కుంకుమ, పసుపు పంపిణీ చేయనున్నట్లు తితిదే ఎస్ఈ రామచంద్రారెడ్డి, కల్యాణ ప్రాజెక్టు ఎస్ఓ రామచంద్రారెడ్డి తెలిపారు. శ్రీనివాస […]పూర్తి వివరాలు ...
పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల 511వ వర్థంతి ఉత్సవాలు ఈనెల 27 నుంచి 31 వరకూ అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక, 108 అడుగుల విగ్రహం వద్ద, తిరుమల, తిరుపతిలలో దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తి.తి.దే డిప్యూటీ ఈవోలు శారద, బాలాజీ, ఏఈవో పద్మావతి తెలిపారు. ఇటీవల తాళ్లపాక అన్నమాచార్య ధ్యానమందిరంలో వర్థంతి ఉత్సవాల గోడపత్రాన్ని విడుదల చేశారు. తాళ్ళపాక, 108 అడుగుల విగ్రహం వద్ద జరిగే కార్యక్రమాలు: 27న బహుళద్వాదశి పూజలు, గోష్ఠిగానం, అన్నమయ్య చిత్రపటం […]పూర్తి వివరాలు ...
కలియుగ ప్రత్యక్షదైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, శ్రీ వెంకటేశ్వరస్వామిని ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదు. అందుకే ఆయన సన్నిధి ఎప్పుడూ జనసంద్రమే. ఆ స్వామిని సులభంగా దర్శించుకునే అవకాశం కల్పించడానికి, ఆయన సన్నిధిలో ఆర్జిత సేవలందించడానికి, తిరుమల గిరిపై శ్రమ లేకుండా ఒకరోజు సేద తీరేందుకు గదిని సంపాదించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్ పద్ధతిలో ఈ-సేవ కౌంటర్లను ఏర్పాటు చేశారు.కడప నగరంలో మద్రాసురోడ్డులోని టీటీడీ కల్యాణ మండపంలో ఈ-సేవా కౌంటర్ ఏర్పాటు చేశారు.పూర్తి వివరాలు ...